అట్టే కాని రారాదా అదియుఁ జూతువు గాని
(॥పల్లవి॥)
అట్టే కాని రారాదా అదియుఁ జూతువు గాని
ముట్టి నా చన్నుల గోరుమోపఁగా నోపుదువా
(॥అట్టే॥)
మగిడి మగిడి నాతో మాటలాడవచ్చేవు
తగవుకు వచ్చేవా తప్పక నీవు
యెగసక్కేలకు నాతో నేలాటము లాడేవు
నగవులు నిజాలకు నవ్వఁగనోపుదువా
(॥అట్టే॥)
మొనసి నాతోను సాములు సేయఁజూచేవు
పెనఁగులాడ వచ్చేవా పిరి దూరి
ననుపులు సేసుకొని నన్ను నీవు గొసరేవే
చనవున నిట్టానే సరి దూఁగఁగలవా
(॥అట్టే॥)
కలసి మెలసి నన్నుఁ గాఁగిలించఁజూచేవు
బలిమి చూప వచ్చేవా పలురతుల
అలరి శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
చలపట్టి యేలితివి జవదాఁటేవా
(||pallavi||)
aṭṭe kāni rārādā adiyum̐ jūduvu gāni
muṭṭi nā sannula gorumobam̐gā nobuduvā
(||aṭṭe||)
magiḍi magiḍi nādo māḍalāḍavachchevu
tagavugu vachchevā tappaga nīvu
yĕgasakkelagu nādo nelāḍamu lāḍevu
nagavulu nijālagu navvam̐ganobuduvā
(||aṭṭe||)
mŏnasi nādonu sāmulu seyam̐jūsevu
pĕnam̐gulāḍa vachchevā piri dūri
nanubulu sesugŏni nannu nīvu gŏsareve
sanavuna niṭṭāne sari dūm̐gam̐galavā
(||aṭṭe||)
kalasi mĕlasi nannum̐ gām̐giliṁcham̐jūsevu
balimi sūba vachchevā paluradula
alari śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
salabaṭṭi yelidivi javadām̐ṭevā