అట్టే కానీవయ్య అన్నియుఁ జక్కనయ్యీని
(॥పల్లవి॥)
అట్టే కానీవయ్య అన్నియుఁ జక్కనయ్యీని
గట్టువాయ(యి?)వాఁడవౌత కానవచ్చెను
(॥అట్టే॥)
కప్పురపుటింటిలో నీకతలు
చెప్పుదుమా నేఁడు నీ చెలితోను
తప్పక తెరలో నీవు దాఁచినాపెను
యిప్పుడాకె గంటే నిన్ను నేమనునో
(॥అట్టే॥)
సింగారపుఁదోఁటలో నీచేఁతలు
రంగుగఁ జూపుదుమా నీ రమణికి
అంగవించి తెచ్చుకొన్న ఆపెపాటలు
సంగతిగా వింటే నెంత జంకించునో
(॥అట్టే॥)
శ్రీ వేంకటాద్రిమీఁది చిఱునవ్వులు
భావానఁ దెలుపుదుమా పడఁతికి
ఆవటించీపెఁ గూడితి వప్పటాపెను
తావున మాటాడి యెంత దయసేసునో
(||pallavi||)
aṭṭe kānīvayya anniyum̐ jakkanayyīni
gaṭṭuvāya(yi?)vām̐ḍavauda kānavachchĕnu
(||aṭṭe||)
kappurabuḍiṁṭilo nīgadalu
sĕppudumā nem̐ḍu nī sĕlidonu
tappaga tĕralo nīvu dām̐sinābĕnu
yippuḍāgĕ gaṁṭe ninnu nemanuno
(||aṭṭe||)
siṁgārabum̐dom̐ṭalo nīsem̐talu
raṁgugam̐ jūbudumā nī ramaṇigi
aṁgaviṁchi tĕchchugŏnna ābĕbāḍalu
saṁgadigā viṁṭe nĕṁta jaṁkiṁchuno
(||aṭṭe||)
śhrī veṁkaḍādrimīm̐di siṟunavvulu
bhāvānam̐ dĕlubudumā paḍam̐tigi
āvaḍiṁchībĕm̐ gūḍidi vappaḍābĕnu
tāvuna māḍāḍi yĕṁta dayasesuno