అట్టె కాదా తనమోహ మందరు నెరఁగ వద్దా
(॥పల్లవి॥)
అట్టె కాదా తనమోహ మందరు నెరఁగ వద్దా
మిట్టిపడి యిందుకే మెచ్చితిఁగా నేను
(॥అట్టె॥)
సవతులతో నేను సారె వాదు లడువఁగ
తవిలి సాకిరి చెప్పీఁ దన కేలే
యివల నేఁ దనుఁ జూచి యిందుకే వెల గంది
కవకవ నవ్వితిని కడు సంగ తేయఁగా
(॥అట్టె॥)
పగ చాటి వారు నేను పంతములు నెరపితే
తగవులు పచరించీఁ దన కేలే
అగ డై యందుకే నేను అది యటు వెట్టి పతి
మొగమె తప్పక చూచే మగిసెఁనా పనులు
(॥అట్టె॥)
వుఱక మాలో నేము వొట్లు వెట్టుకొంటేను
తఱి సందిమాట లాడీఁ దన కేలే
యెఱిఁగి శ్రీవెంకటేశుఁ డిందుకే నన్నుఁ గూడఁగ
మఱచితి నన్నియును మన సొక్క టాయఁ గా
(||pallavi||)
aṭṭĕ kādā tanamoha maṁdaru nĕram̐ga vaddā
miṭṭibaḍi yiṁduge mĕchchidim̐gā nenu
(||aṭṭĕ||)
savadulado nenu sārĕ vādu laḍuvam̐ga
tavili sāgiri sĕppīm̐ dana kele
yivala nem̐ danum̐ jūsi yiṁduge vĕla gaṁdi
kavagava navvidini kaḍu saṁga teyam̐gā
(||aṭṭĕ||)
paga sāḍi vāru nenu paṁtamulu nĕrabide
tagavulu pasariṁchīm̐ dana kele
aga ḍai yaṁduge nenu adi yaḍu vĕṭṭi padi
mŏgamĕ tappaga sūse magisĕm̐nā panulu
(||aṭṭĕ||)
vuṟaga mālo nemu vŏṭlu vĕṭṭugŏṁṭenu
taṟi saṁdimāḍa lāḍīm̐ dana kele
yĕṟim̐gi śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁduge nannum̐ gūḍam̐ga
maṟasidi nanniyunu mana sŏkka ṭāyam̐ gā