Atte iyyagolu gomte nanni yunu mamchidavunu

అట్టె ఇయ్యకోలు గొంటే నన్ని యును మంచిదవును
Language

(॥పల్లవి॥)
అట్టె ఇయ్యకోలు గొంటే నన్ని యును మంచిదవును
ఱట్టడితనాల నేల గుట్టు సేసేవు

(॥అట్టె॥)
చనవుమెరసి యాపె సంగడిఁ గూచుంటేను
చెనకీనంటా నీవు సిగ్గువడేవు
మనసు నొవ్వకుండా మాటలు నిన్నాడితేను
యెనలేనివెంగేలందు యేల పట్టేవు

(॥అట్టె॥)
తగులు గలిగి యాపె తఱచుగా నవ్వితేను
యెగసక్యాలంటా నేల యెగ్గుపట్టేవు
మొగము చూచినందుకు ముద్దుటుంగర మిమ్మంటే
అగడాయఁ బనులంటా ఆనలు వెట్టేవు

(॥అట్టె॥)
ఘనమోహముతో నాపె కాఁగిలించుకొంటేను
తనువు సోదించె నంటాఁ దల వంచేవు
యెనసె శ్రీవేంకటేశ యిచ్చకము నీకుఁ జేసె
కనుచొక్కి మెచ్చి మెచ్చి కప్పుర మిచ్చేవు

(||pallavi||)
aṭṭĕ iyyagolu gŏṁṭe nanni yunu maṁchidavunu
ṟaṭṭaḍidanāla nela guṭṭu sesevu

(||aṭṭĕ||)
sanavumĕrasi yābĕ saṁgaḍim̐ gūsuṁṭenu
sĕnagīnaṁṭā nīvu sigguvaḍevu
manasu nŏvvaguṁḍā māḍalu ninnāḍidenu
yĕnalenivĕṁgelaṁdu yela paṭṭevu

(||aṭṭĕ||)
tagulu galigi yābĕ taṟasugā navvidenu
yĕgasakyālaṁṭā nela yĕggubaṭṭevu
mŏgamu sūsinaṁdugu mudduḍuṁgara mimmaṁṭe
agaḍāyam̐ banulaṁṭā ānalu vĕṭṭevu

(||aṭṭĕ||)
ghanamohamudo nābĕ kām̐giliṁchugŏṁṭenu
tanuvu sodiṁchĕ naṁṭām̐ dala vaṁchevu
yĕnasĕ śhrīveṁkaḍeśha yichchagamu nīgum̐ jesĕ
kanusŏkki mĕchchi mĕchchi kappura michchevu