Title (Indic)సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో WorkAthidhi Year2007 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Usha Performer Deeboo Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేది ఎవరు ఈ కంటికైనా రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా నిను నీవే సరిగ్గా కనలేవే మనసా నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా ఏవో జ్ఞాపకాల సుడి దాటి బయటపడలేవా ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా చరణం 1: చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని నిజమైనా నమ్మేస్తమా భ్రమలో పడమా తెలిసి జాబిలిని వేలివేస్తమా తనతో చెలిమిని విడిచి రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా నిను నీవే సరిగ్గా కనలేవే మనసా నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా చరణం 2: పోయింది వెతికే వేదనా ఉండుంది ఏదో పోల్చునా సంద్రంలో ఎగిసే ఆలకి అలజడి నిలిచేదెప్పుడో సందేహం కలిగే మదికి కలతని తీర్చేదేవరో శాపంలాగ వెంట పడుతున్న గతం ఏదైనా దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా Englishpallavi: satyaṁ emiḍo svapnaṁ emiḍo sĕppedi ĕvaru ī kaṁṭigainā rĕppala duppaḍi kappe sīgaḍi sūbiṁchenā e kāṁtinainā ninu nīve sariggā kanaleve manasā naḍirādiri naḍagā kaḍaderadu tĕlusā evo jñābagāla suḍi dāḍi bayaḍabaḍalevā ĕnno tībi saṁgadula rebu pilubu vinalevā saraṇaṁ 1: saṁdruḍi ĕdalo maṁṭani vĕnnĕla anuguṁṭārani nijamainā nammestamā bhramalo paḍamā tĕlisi jābilini velivestamā tanado sĕlimini viḍisi rūbaṁ ledu ganaga sākṣhyālu aḍigi ĕvarainā prāṇaṁ unigi paina anumāna paḍaru ĕbuḍainā ninu nīve sariggā kanaleve manasā naḍirādiri naḍagā kaḍaderadu tĕlusā saraṇaṁ 2: poyiṁdi vĕdige vedanā uṁḍuṁdi edo polsunā saṁdraṁlo ĕgise ālagi alajaḍi nilisedĕppuḍo saṁdehaṁ kalige madigi kaladani tīrsedevaro śhābaṁlāga vĕṁṭa paḍudunna gadaṁ edainā dībaṁ lāga tagina dāredo sūbagaligenā