Asurusurula neegu nalabemtige

అసురుసురుల నీకు నలపేఁటికే
Language

(॥పల్లవి॥)
అసురుసురుల నీకు నలపేఁటికే
వసమై యతఁడు నీవద్ద నుండీఁగాక

(॥॥)
యెలజవ్వనివి నీవు యేల చిన్నఁబోతివే
వలచినపతి నేఁడే వచ్చిఁగాక
నిలువునఁ దలవంచి నేలవాఁత లేఁటికే
చెలువపునీచనవే చెల్లించీఁగాక

(॥॥)
చెక్కుచేతితోడ వట్టి చింతఁ బొరల నేఁటికే
వొక్కటై పతిఁగూడి నీ వుండేవు గాక
ముక్కున వేలుమోపి మోనపువెర గేఁటికే
మిక్కిలి విభుఁడు నిన్నే మెప్పించీఁగాక

(॥॥)
పచ్చికస్తూరి నుదుటఁ బట్టువెట్ట నేఁటికే
మచ్చిక నీరమణుఁడే మన్నించీఁ గాక
అచ్చపు శ్రీవేంకటేశుఁ డాతఁడే నిన్నుఁ గూడె
యిచ్చట నొడఁబాటేనే యీడ నుండీఁగాక

(||pallavi||)
asurusurula nīgu nalabem̐ṭige
vasamai yadam̐ḍu nīvadda nuṁḍīm̐gāga

(||||)
yĕlajavvanivi nīvu yela sinnam̐bodive
valasinabadi nem̐ḍe vachchim̐gāga
niluvunam̐ dalavaṁchi nelavām̐ta lem̐ṭige
sĕluvabunīsanave sĕlliṁchīm̐gāga

(||||)
sĕkkusedidoḍa vaṭṭi siṁtam̐ bŏrala nem̐ṭige
vŏkkaḍai padim̐gūḍi nī vuṁḍevu gāga
mukkuna velumobi monabuvĕra gem̐ṭige
mikkili vibhum̐ḍu ninne mĕppiṁchīm̐gāga

(||||)
pachchigastūri nuduḍam̐ baṭṭuvĕṭṭa nem̐ṭige
machchiga nīramaṇum̐ḍe manniṁchīm̐ gāga
achchabu śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe ninnum̐ gūḍĕ
yichchaḍa nŏḍam̐bāḍene yīḍa nuṁḍīm̐gāga