(॥పల్లవి॥)
అసలు చెరుచకుమీ యచ్యుత
ఆ సుద్దులె యీ సుద్దులు అచ్యుతా*
(॥ఆలు॥)
అలవాటే తొల్లే నీకు నచ్యుతా అలుగము ఇంక నీతో నచ్యుతా
ఆలయకు మింక నీవు అచ్యుతా నిన్ను నలమి పట్టెఁగాని యచ్యుతా
(॥ఆలు॥)
ఆలసించఁ బనిలేదు అచ్యుతా ఆలిమగని సంధి నచ్యుతా
ఔలే నీ విట్టే యచ్యుతా ఆలించి మమ్మేలితివి ఆచ్యుతా
(॥ఆలు॥)
ఆసము దించకు మింక నచ్యుతా అసురుసురై చిక్కితి మచ్యుతా
ఆసలు చెమటఁ గడి యచ్యుతారతి యసుదా శ్రీవేంకటాద్రి యచ్యుతా
(||pallavi||)
asalu sĕrusagumī yachyuda
ā suddulĕ yī suddulu achyudā*
(||ālu||)
alavāḍe tŏlle nīgu nachyudā alugamu iṁka nīdo nachyudā
ālayagu miṁka nīvu achyudā ninnu nalami paṭṭĕm̐gāni yachyudā
(||ālu||)
ālasiṁcham̐ baniledu achyudā ālimagani saṁdhi nachyudā
aule nī viṭṭe yachyudā āliṁchi mammelidivi āchyudā
(||ālu||)
āsamu diṁchagu miṁka nachyudā asurusurai sikkidi machyudā
āsalu sĕmaḍam̐ gaḍi yachyudāradi yasudā śhrīveṁkaḍādri yachyudā