Arudu raamunisemta ladigo pushpagamunu

అరుదు రామునిచేఁత లదిగో పుష్పకమును
Language

(॥పల్లవి॥)
అరుదు రామునిచేఁత లదిగో పుష్పకమును
సొరిది మన బాలులే సోద్యము గదమ్మా

(॥॥)
హరునివిల్లు విరిచె అట్టె సీతఁ బెండ్లాదె
పరశురాముని బాహుబలము గొనె
సురలకు మునులకు సొరిది నభయమిచ్చె
వరుస నయోధ్య యేలవచ్చె నటవమ్మా

(॥॥)
వాలిఁ గొటి సుగ్రీవువరరాజ్య మిచ్చెనట
చాలుగాఁ గొండలనే జలధిగట్టె
తీలుగా రావణుఁ జంపి చెగి లంక సాదించి
వాలినసేనలఁ గూడి వచ్చెనటవమ్మా

(॥॥)
కాంతయైనసీతఁ గూడి కలుషములెల్లఁ బాపి
పంతముతో విభీషణుఁ బట్టముగట్టి
ఇంతటా శ్రీ వేంకటాద్రి నిరవున వేఁటలాడి
వంతులకు రాజ్య మేలవచ్చెనటవమ్మా

(||pallavi||)
arudu rāmunisem̐ta ladigo puṣhpagamunu
sŏridi mana bālule sodyamu gadammā

(||||)
harunivillu virisĕ aṭṭĕ sīdam̐ bĕṁḍlādĕ
paraśhurāmuni bāhubalamu gŏnĕ
suralagu munulagu sŏridi nabhayamichchĕ
varusa nayodhya yelavachchĕ naḍavammā

(||||)
vālim̐ gŏḍi sugrīvuvararājya michchĕnaḍa
sālugām̐ gŏṁḍalane jaladhigaṭṭĕ
tīlugā rāvaṇum̐ jaṁpi sĕgi laṁka sādiṁchi
vālinasenalam̐ gūḍi vachchĕnaḍavammā

(||||)
kāṁtayainasīdam̐ gūḍi kaluṣhamulĕllam̐ bābi
paṁtamudo vibhīṣhaṇum̐ baṭṭamugaṭṭi
iṁtaḍā śhrī veṁkaḍādri niravuna vem̐ṭalāḍi
vaṁtulagu rājya melavachchĕnaḍavammā