Arudu neeseritramu hari ne nidiye talamsugoni

అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
Language

(॥పల్లవి॥)
అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
శరణంటిఁ గావు మిదియ విన్నపము సరిలేరు నీకు

(॥అరు॥)
పరగ నీయకారణబంధుత్వ మహల్యయందుఁ గంటిమి
కరియందు నార్తరక్షకత్వము మెరయఁగఁ గంటిమి
అరసి ద్రౌపదియందు నాపదుద్ధారకత్వము గంటిమి
శరణంటెఁ గాచుట ధర విభీషుణునందుఁ గంటిమి

(॥అరు॥)
మును భక్తవత్సలత్వము నీకు శబరియందుఁ గంటిమి
అనాథనాథుడవు నీ వగుట గ్రీవునందుఁ గంటిమి
పెనఁగి నిరుహేతుకప్రేమ పరీక్షితునందుఁ గంటిమి
నినుఁ గింకరాధీనుఁడని ప్రహ్లాదునియందేఁ గంటిమి

(॥అరు॥)
గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి
భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి
దేవ శ్రీవేంకటేశ్వర నీవు ద్రిష్టవరదుఁడవగుట
తావైన నీకొనేటిదండ నొసఁగేయందే కంటిమి

(||pallavi||)
arudu nīsĕritramu hari ne nidiye talam̐sugŏni
śharaṇaṁṭim̐ gāvu midiya vinnabamu sarileru nīgu

(||aru||)
paraga nīyagāraṇabaṁdhutva mahalyayaṁdum̐ gaṁṭimi
kariyaṁdu nārdarakṣhagatvamu mĕrayam̐gam̐ gaṁṭimi
arasi draubadiyaṁdu nābaduddhāragatvamu gaṁṭimi
śharaṇaṁṭĕm̐ gāsuḍa dhara vibhīṣhuṇunaṁdum̐ gaṁṭimi

(||aru||)
munu bhaktavatsalatvamu nīgu śhabariyaṁdum̐ gaṁṭimi
anāthanāthuḍavu nī vaguḍa grīvunaṁdum̐ gaṁṭimi
pĕnam̐gi niruhedugaprema parīkṣhidunaṁdum̐ gaṁṭimi
ninum̐ giṁkarādhīnum̐ḍani prahlāduniyaṁdem̐ gaṁṭimi

(||aru||)
govardhanamaṁdu sarvajīvadayābaratvamu gaṁṭimi
bhāviṁchi sāṁdībunaṁdu pradijñābālagatvamu gaṁṭimi
deva śhrīveṁkaḍeśhvara nīvu driṣhṭavaradum̐ḍavaguḍa
tāvaina nīgŏneḍidaṁḍa nŏsam̐geyaṁde kaṁṭimi