అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
(॥పల్లవి॥)
అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
సిరులతో నుదయించె శ్రీకృష్ణుఁడిదివో
(॥॥)
వసుదేవునిపాలిటి వరతపోధనము
యెసగి దేవకీదేవి యెదపై సొమ్ము
సుసరాన గొల్లెతల సొంపు మంగళసూత్రము
శిసువై వుదయించె శ్రీకృష్ణుఁ డిదివో
(॥॥)
నందగోపుఁడు గన్న నమ్మిన నిధానము
పొందగు యశోదకు పూజదైవము
మందల యావులకును మంచి వజ్రపంజరము
చెంది యుదయించినాఁడు శ్రీకృష్ణుఁడిదివో
(॥॥)
సేవ సేసే దాసుల చేతిలోని మాణికము
శ్రీవేంకటాద్రి నేచిన బ్రహ్మము
వోవరి నలమేల్మంగ నురముపైఁ బెట్టుకొని
చేవదేర నుదయించె శ్రీకృష్ణుఁడిదివో
(||pallavi||)
araya śhrāvaṇa bahuḽāṣhṭami saṁdrodayāna
sirulado nudayiṁchĕ śhrīkṛṣhṇum̐ḍidivo
(||||)
vasudevunibāliḍi varadabodhanamu
yĕsagi devagīdevi yĕdabai sŏmmu
susarāna gŏllĕdala sŏṁpu maṁgaḽasūtramu
śhisuvai vudayiṁchĕ śhrīkṛṣhṇum̐ ḍidivo
(||||)
naṁdagobum̐ḍu ganna nammina nidhānamu
pŏṁdagu yaśhodagu pūjadaivamu
maṁdala yāvulagunu maṁchi vajrabaṁjaramu
sĕṁdi yudayiṁchinām̐ḍu śhrīkṛṣhṇum̐ḍidivo
(||||)
seva sese dāsula sediloni māṇigamu
śhrīveṁkaḍādri nesina brahmamu
vovari nalamelmaṁga nuramubaim̐ bĕṭṭugŏni
sevadera nudayiṁchĕ śhrīkṛṣhṇum̐ḍidivo