Araya naabebai neegu natlaane kaambolu

అరయ నాపెపై నీకు నట్లానె కాఁబోలు
Language

(॥పల్లవి॥)
అరయ నాపెపై నీకు నట్లానె కాఁబోలు
గరిమ మీ గుణములు కడుఁ గొత్తలయ్యా

(॥॥)
మొగము చూచి చూచి మోహములు చల్లి చల్లి
చిగురు మోవితేనె చింది చింది
పగటున మాటలాడి పచ్చి దేరఁ దమకించీ
మగువ వేడుకలు యేమని చెప్పేమయ్యా

(॥॥)
చేతులు చాఁచి చాఁచి సెలవుల నవ్వు నవ్వి
పోతరపు సరసాలు పూసి పూసి
రాతిరిఁ బగలుఁ బొంచి రతులకే యాసగించీ
యీ తరుణి కోరిక లెన్ని లేవయ్యా

(॥॥)
చనుఁగవ నొత్తి యొత్తి జవ్వాది మెత్తి మెత్తి
పెనఁగి పెనఁగి సిగ్గు పెంచి పెంచి
యెనసెను శ్రీ వేంకటేశ నిన్ను నింతలోనే
వనిత చందము లివి వసమా నేఁడయ్యా

(||pallavi||)
araya nābĕbai nīgu naṭlānĕ kām̐bolu
garima mī guṇamulu kaḍum̐ gŏttalayyā

(||||)
mŏgamu sūsi sūsi mohamulu salli salli
siguru movidenĕ siṁdi siṁdi
pagaḍuna māḍalāḍi pachchi deram̐ damagiṁchī
maguva veḍugalu yemani sĕppemayyā

(||||)
sedulu sām̐si sām̐si sĕlavula navvu navvi
podarabu sarasālu pūsi pūsi
rādirim̐ bagalum̐ bŏṁchi radulage yāsagiṁchī
yī taruṇi koriga lĕnni levayyā

(||||)
sanum̐gava nŏtti yŏtti javvādi mĕtti mĕtti
pĕnam̐gi pĕnam̐gi siggu pĕṁchi pĕṁchi
yĕnasĕnu śhrī veṁkaḍeśha ninnu niṁtalone
vanida saṁdamu livi vasamā nem̐ḍayyā