అరవిరి బాగుల యతివ నీ వవుదువే
(॥పల్లవి॥)
అరవిరి బాగుల యతివ నీ వవుదువే
సొరిది నీ వొయ్యారాలు చూడఁ గొత్తలాయనే
(॥అర॥)
నిదుర కన్నులతోడి నివ్వెరగులు
చెదరుఁ గురుల చిమ్మఁజీఁకటులు
వెదచల్లు నవ్వులవెన్నెలలు
తుదకెక్కి రది గఱుతులు నీ కొనరెనే
(॥అర॥)
పచ్చిదేరేటి చెక్కులపై చెమటలు
ముచ్చటలాడుకొనేటి మోవివాడులు
కొచ్చి కొచ్చి సొలసేటి కొనచూపులు
అచ్చముగ నీమేని కన్నియు నమరెనే
(॥అర॥)
ముప్పిరి సమరతుల మోముకళలు
కుప్పలుగా రాలేటి కొప్పువిరులు
వొప్పి శ్రీవేంకటేశుఁ గూడున్న చొప్పులు
యిప్పు డీ శింగారాలు యివి నీకే తగునే
(||pallavi||)
araviri bāgula yadiva nī vavuduve
sŏridi nī vŏyyārālu sūḍam̐ gŏttalāyane
(||ara||)
nidura kannuladoḍi nivvĕragulu
sĕdarum̐ gurula simmam̐jīm̐kaḍulu
vĕdasallu navvulavĕnnĕlalu
tudagĕkki radi gaṟudulu nī kŏnarĕne
(||ara||)
pachchidereḍi sĕkkulabai sĕmaḍalu
muchchaḍalāḍugŏneḍi movivāḍulu
kŏchchi kŏchchi sŏlaseḍi kŏnasūbulu
achchamuga nīmeni kanniyu namarĕne
(||ara||)
muppiri samaradula momugaḽalu
kuppalugā rāleḍi kŏppuvirulu
vŏppi śhrīveṁkaḍeśhum̐ gūḍunna sŏppulu
yippu ḍī śhiṁgārālu yivi nīge tagune