Appuduvo ninum goluvamga naruhamu galuguda praanigi

అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి
Language

(॥పల్లవి॥)
అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి
కప్పినదియుఁ గప్పనిదియుఁ గనుఁగొనఁగలనాఁడు

(॥అప్పుడు॥)
ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పినినాఁడు
పాపములకు పుణ్యములకుఁ బనిదొలఁగిననాఁడు
కోపములకు శాంతములకుఁ గూటమి మానిననాఁడు
లోపల వెలుపల తనమతిలోఁ దెలిసిననాఁడు

(॥అప్పుడు॥)
తనవారలఁ బెరవారలఁ దాఁ దెలిసిననాఁడు
మనసునఁ జైతన్యంబున మఱపందిననాఁడు
పనివడి తిరువేంకటగిరిపతి నీదాసులదాసులఁ
గనుఁగొని నీభావముగాఁ గనువిచ్చిననాఁడు

(||pallavi||)
appuḍuvo ninum̐ gŏluvam̐ga naruhamu galuguḍa prāṇigi
kappinadiyum̐ gappanidiyum̐ ganum̐gŏnam̐galanām̐ḍu

(||appuḍu||)
ābadalagu saṁpadalagu naḍḍamusĕppininām̐ḍu
pābamulagu puṇyamulagum̐ banidŏlam̐ginanām̐ḍu
kobamulagu śhāṁtamulagum̐ gūḍami māninanām̐ḍu
lobala vĕlubala tanamadilom̐ dĕlisinanām̐ḍu

(||appuḍu||)
tanavāralam̐ bĕravāralam̐ dām̐ dĕlisinanām̐ḍu
manasunam̐ jaidanyaṁbuna maṟabaṁdinanām̐ḍu
panivaḍi tiruveṁkaḍagiribadi nīdāsuladāsulam̐
ganum̐gŏni nībhāvamugām̐ ganuvichchinanām̐ḍu