Appuduvo nannum joose damtaa neevu

అప్పుడువో నన్నుఁ జూచే దంతా నీవు
Language

(॥పల్లవి॥)
అప్పుడువో నన్నుఁ జూచే దంతా నీవు
చెప్పక నీవు దాఁచిన చెలిఁ గంటేఁ గాని

(॥అప్పుడునో॥)
చెప్ప రాదు గాని నా చిత్తములోని చింత
వుప్పతిల్తి వున్నది నా వొళ్లఁ జూడరా
కప్పురానాఁ బోదు చల్లగాలిచేతా నారదు
తప్పదు నిన్ను రానీనిదానిఁ గంటేఁ గాని

(॥అప్పుడునో॥)
చూప రాదు గాని నా చుట్టుకొన్నతమకము
ఆఁప రానినిట్టూరుపు లందుఁ జూడరా
తీపుల మాటలఁ బోదు తేటల వెన్నలఁ బోదు
తాపి యై నిన్ను బోదించేదానిఁ గంటేఁ గాని

(॥అప్పుడునో॥)
యెంచ రాదు గాని నా యీరసపుఁ జలములు
యించుక నా కాఁగిటిలో నిదె చూడారా
ముంచిన శ్రీవెంకటేశ మూసి మంతనాలఁ బోదు
అంచెల నీ మేలుదాని నట్టెకంటేఁ గాని

(||pallavi||)
appuḍuvo nannum̐ jūse daṁtā nīvu
sĕppaga nīvu dām̐sina sĕlim̐ gaṁṭem̐ gāni

(||appuḍuno||)
sĕppa rādu gāni nā sittamuloni siṁta
vuppadildi vunnadi nā vŏḽlam̐ jūḍarā
kappurānām̐ bodu sallagālisedā nāradu
tappadu ninnu rānīnidānim̐ gaṁṭem̐ gāni

(||appuḍuno||)
sūba rādu gāni nā suṭṭugŏnnadamagamu
ām̐pa rāniniṭṭūrubu laṁdum̐ jūḍarā
tībula māḍalam̐ bodu teḍala vĕnnalam̐ bodu
tābi yai ninnu bodiṁchedānim̐ gaṁṭem̐ gāni

(||appuḍuno||)
yĕṁcha rādu gāni nā yīrasabum̐ jalamulu
yiṁchuga nā kām̐giḍilo nidĕ sūḍārā
muṁchina śhrīvĕṁkaḍeśha mūsi maṁtanālam̐ bodu
aṁchĕla nī meludāni naṭṭĕgaṁṭem̐ gāni