Appudugaani teravu amgana kobamulellaa

అప్పుడుగాని తేరవు అంగన కోపములెల్లా
Language

(॥పల్లవి॥)
అప్పుడుగాని తేరవు అంగన కోపములెల్లా
కప్పురము చల్లవయ్య కాఁకలు చల్లారను

(॥॥)
తివిరి నీవేమంటివో దేవరకే తెలుసును
పవళించి వున్నదదే పడఁతి లోన
వివరించి నీరాక విన్నవించ వెరతుము
కవగూడ నీవే యాపెకడకుఁ బోవయ్యా

(॥॥)
వొగ్గి యేమి సేసితివో వూరకే తొడిఁబడ
సిగ్గువడి వున్నదదే చెలి వొంటిని
నిగ్గులను బూనుకొని నీకుఁగా రారాదు మాకు
దిగ్గన నియ్యాపె సందితెర దియ్యవయ్యా

(॥॥)
ఆడకే యేమని చెప్పయంపితివో యింతలోనే
పాడుకొంటా నున్నదింతి పానుపుమీఁద
కూడితి శ్రీవేంకటాద్రి గోవిందరాజ నీవు
వోడక కాఁగిట నిట్టే వూరడించవయ్యా

(||pallavi||)
appuḍugāni teravu aṁgana kobamulĕllā
kappuramu sallavayya kām̐kalu sallāranu

(||||)
tiviri nīvemaṁṭivo devarage tĕlusunu
pavaḽiṁchi vunnadade paḍam̐ti lona
vivariṁchi nīrāga vinnaviṁcha vĕradumu
kavagūḍa nīve yābĕgaḍagum̐ bovayyā

(||||)
vŏggi yemi sesidivo vūrage tŏḍim̐baḍa
sigguvaḍi vunnadade sĕli vŏṁṭini
niggulanu būnugŏni nīgum̐gā rārādu māgu
diggana niyyābĕ saṁdidĕra diyyavayyā

(||||)
āḍage yemani sĕppayaṁpidivo yiṁtalone
pāḍugŏṁṭā nunnadiṁti pānubumīm̐da
kūḍidi śhrīveṁkaḍādri goviṁdarāja nīvu
voḍaga kām̐giḍa niṭṭe vūraḍiṁchavayyā