అప్పుడుగాని తలఁపు అలవాటై వుండదు
(॥పల్లవి॥)
అప్పుడుగాని తలఁపు అలవాటై వుండదు
వుప్పతిల్లు తత్త్వజ్ఞానికి వూహింపుచు నుండఁగవలెను
(॥అప్పుడు॥)
సాలీని మతి పడుగు చరిసేసే యందే యుండు
గాలిపు బెండుపై వేఁటకాని కుండును
వాలాయించి దృష్టి వింటివానికి గుఱిపై నుండు
యీ లీల తత్త్వజ్ఞానికి యెచ్చరికై యుండవలెను
(॥అప్పుడు॥)
దున్నేవానికి మనసు తొలుతఁ జాలుపై నుండు
పన్ని జూజరికి నాటపై నుండును
సన్నలఁ గోమటిచూపు సరకులపై నుండు
యెన్నఁగాఁ దత్త్వజ్ఞానికి యెచ్చరికై యుండవలెను
(॥అప్పుడు॥)
భూమిలో దొంగకు చింత పొద్దు పైనే వుండు
కాముకుని తలపోఁత కాంతపై నుండు
ఆముకొని శ్రీవేంకటేశుఁ డంతరాత్మయై యుండును
సాముగా తత్త్వజ్ఞానికి సాధింపుచు నుండవలెను
(||pallavi||)
appuḍugāni talam̐pu alavāḍai vuṁḍadu
vuppadillu tattvajñānigi vūhiṁpusu nuṁḍam̐gavalĕnu
(||appuḍu||)
sālīni madi paḍugu sarisese yaṁde yuṁḍu
gālibu bĕṁḍubai vem̐ṭagāni kuṁḍunu
vālāyiṁchi dṛṣhṭi viṁṭivānigi guṟibai nuṁḍu
yī līla tattvajñānigi yĕchcharigai yuṁḍavalĕnu
(||appuḍu||)
dunnevānigi manasu tŏludam̐ jālubai nuṁḍu
panni jūjarigi nāḍabai nuṁḍunu
sannalam̐ gomaḍisūbu saragulabai nuṁḍu
yĕnnam̐gām̐ dattvajñānigi yĕchcharigai yuṁḍavalĕnu
(||appuḍu||)
bhūmilo dŏṁgagu siṁta pŏddu paine vuṁḍu
kāmuguni talabom̐ta kāṁtabai nuṁḍu
āmugŏni śhrīveṁkaḍeśhum̐ ḍaṁtarātmayai yuṁḍunu
sāmugā tattvajñānigi sādhiṁpusu nuṁḍavalĕnu