Appudugaani nee yaasodamu deeradu

అప్పుడుగాని నీ యాసోదము దీరదు
Language

(॥పల్లవి॥)
అప్పుడుగాని నీ యాసోదము దీరదు
ముప్పిరి నీవు కొంగులు ముళ్లువేసుకోవయ్యా

(॥॥)
వినేవు విన్నపములు వేడుకతో మఱవక
వనితమాటలు నీవు వాఁసుకోవయ్యా
యెనలేక చూచేవు యేపొద్దు నాపెమోము
గొనకొని లక్కఁబడెచ్చున వేసుకోవయ్యా

(॥॥)
వొప్పుగ నాపెచన్నులు వూరక పట్టిచూచేవు
గొప్పలెంతలేశో కొల్చుకోవయ్యా
యెప్పుడు నాపెగుణాలే యెంచేవు సారెసారె
తప్పక నీమనసులో దాఁచుకోవయ్యా

(॥॥)
చేరి పాదా లాపెచేత గుద్దించుకోనేవు
కోరి యట్టె కాఁగిలించుకొనవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
సారపునామోవితేనే చవిచూడవయ్యా

(||pallavi||)
appuḍugāni nī yāsodamu dīradu
muppiri nīvu kŏṁgulu muḽluvesugovayyā

(||||)
vinevu vinnabamulu veḍugado maṟavaga
vanidamāḍalu nīvu vām̐sugovayyā
yĕnalega sūsevu yebŏddu nābĕmomu
gŏnagŏni lakkam̐baḍĕchchuna vesugovayyā

(||||)
vŏppuga nābĕsannulu vūraga paṭṭisūsevu
gŏppalĕṁtaleśho kŏlsugovayyā
yĕppuḍu nābĕguṇāle yĕṁchevu sārĕsārĕ
tappaga nīmanasulo dām̐sugovayyā

(||||)
seri pādā lābĕseda guddiṁchugonevu
kori yaṭṭĕ kām̐giliṁchugŏnavayyā
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sārabunāmovidene savisūḍavayyā