అప్పుడుగాని నాకు నాతుమ సమ్మతించదు
(॥పల్లవి॥)
అప్పుడుగాని నాకు నాతుమ సమ్మతించదు
చిప్పిల నా మోము చూచి సెలవుల నగుమా
(॥అప॥)
అగ్గలపుఆసతో నిన్నాడరానిమాట లాడీ
సిగ్గుతోడ నున్నరాన శిరసువంచి
యెగ్గుపట్టనని నాయెదలొ నమ్మికవుట్ట
బెగ్గిలక తలఁ జెయి పెట్టుమా నాకును
(॥అప॥)
వొంటిఁ జిక్కించుక నిన్నునొక్కక్కచేఁతే సేసీ
ఇంటిలొ మొకదాకిరి నిట్టున్నదాన
దంటనని యెంచి నాపైఁ దప్పుమోవనాడనని
అంటి నాచన్నులమీఁద నానవెట్టుమా
(॥అప॥)
కలసేతమకమున గబ్బితనములు చూపి
తలపొయుచున్నదానఁ దగదనుచు
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసితి విఁక నన్నుఁ గడునాదరించేమీ
(||pallavi||)
appuḍugāni nāgu nāduma sammadiṁchadu
sippila nā momu sūsi sĕlavula nagumā
(||aba||)
aggalabuāsado ninnāḍarānimāḍa lāḍī
siggudoḍa nunnarāna śhirasuvaṁchi
yĕggubaṭṭanani nāyĕdalŏ nammigavuṭṭa
bĕggilaga talam̐ jĕyi pĕṭṭumā nāgunu
(||aba||)
vŏṁṭim̐ jikkiṁchuga ninnunŏkkakkasem̐te sesī
iṁṭilŏ mŏgadāgiri niṭṭunnadāna
daṁṭanani yĕṁchi nābaim̐ dappumovanāḍanani
aṁṭi nāsannulamīm̐da nānavĕṭṭumā
(||aba||)
kalasedamagamuna gabbidanamulu sūbi
talabŏyusunnadānam̐ dagadanusu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasidi vim̐ka nannum̐ gaḍunādariṁchemī