అప్పుడు వద్దని వల పాఁపరాదు
(॥పల్లవి॥)
అప్పుడు వద్దని వల పాఁపరాదు
వొప్పుగ నిన్నలమితే వోరువఁగఁ గలవా
(॥అప్పు॥)
యీరీతి మీరిద్దరు నేకతములాడుకోఁగా
మేరతో వినవచ్చునా మించి యొకతె
ఆరసి యేల పిలిచే వండకు రమ్మని మమ్ము
చేరవచ్చితే నాస చిమ్మి రేఁచకుండునా
(॥అప్పు॥)
పరగ నాపె నీవుఁ బవళించివుండఁగాను
సొరిది మిమ్మెవ్వరైనాఁ జూడవచ్చునా
తెరయెత్తి చేయివట్టి తియ్యనేఁటికి మమ్మును
వొరసితేఁ దమకము లుమ్మగిలకుండునా
(॥అప్పు॥)
కందువ నొకరొకరు కాఁగిలించుకుండఁగాను
అందుకొని తేరకత్తె లంటవచ్చునా
యిందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
మందలించితే రతులు మర్మములు ముట్టవా
(||pallavi||)
appuḍu vaddani vala pām̐parādu
vŏppuga ninnalamide voruvam̐gam̐ galavā
(||appu||)
yīrīdi mīriddaru negadamulāḍugom̐gā
merado vinavachchunā miṁchi yŏgadĕ
ārasi yela pilise vaṁḍagu rammani mammu
seravachchide nāsa simmi rem̐saguṁḍunā
(||appu||)
paraga nābĕ nīvum̐ bavaḽiṁchivuṁḍam̐gānu
sŏridi mimmĕvvarainām̐ jūḍavachchunā
tĕrayĕtti seyivaṭṭi tiyyanem̐ṭigi mammunu
vŏrasidem̐ damagamu lummagilaguṁḍunā
(||appu||)
kaṁduva nŏgarŏgaru kām̐giliṁchuguṁḍam̐gānu
aṁdugŏni teragattĕ laṁṭavachchunā
yiṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
maṁdaliṁchide radulu marmamulu muṭṭavā