Appudu soosedivo adhigula nadhamula

అప్పుడు చూచేదివో అధికుల నధముల
Language

(॥పల్లవి॥)
అప్పుడు చూచేదివో అధికుల నధముల
తప్పక యెచ్చరి యిదే తలఁచవో మనసా

(॥అప్పు॥)
కొండలవంటి పనులు కోరి ముంచుకుంటే నూర-
కుండి కైకొననివాఁడే యోగీంద్రుఁడు
నిండిన కోపములకు నెపముల గలిగితే
దండితోఁ గలఁగని యాతఁడే ధీరుఁడు

(॥అప్పు॥)
సూదులవంటి మాటలు సొరిదిఁ జెవి సోఁకితే
వాదులు వెట్టుకొననివాఁడే దేవుఁడు
పాదుకొన్న సంసారబంధము నోరూరించితే
ఆదిగొని మత్తుఁడు గానెట్టివాఁడే పుణ్యుఁడు

(॥అప్పు॥)
గాలాలవంటి యాసలు కడుఁ దగిలి తీసితే
తాలిమితోఁ గదలనాతఁడే ఘనుఁడు
మేలిమి శ్రీవేంకటేశుమీఁద భారము వేసుక
వీలక తనలో విఱ్ఱవీఁగువాఁడే నిత్యుఁడు

(||pallavi||)
appuḍu sūsedivo adhigula nadhamula
tappaga yĕchchari yide talam̐savo manasā

(||appu||)
kŏṁḍalavaṁṭi panulu kori muṁchuguṁṭe nūra-
kuṁḍi kaigŏnanivām̐ḍe yogīṁdrum̐ḍu
niṁḍina kobamulagu nĕbamula galigide
daṁḍidom̐ galam̐gani yādam̐ḍe dhīrum̐ḍu

(||appu||)
sūdulavaṁṭi māḍalu sŏridim̐ jĕvi som̐kide
vādulu vĕṭṭugŏnanivām̐ḍe devum̐ḍu
pādugŏnna saṁsārabaṁdhamu norūriṁchide
ādigŏni mattum̐ḍu gānĕṭṭivām̐ḍe puṇyum̐ḍu

(||appu||)
gālālavaṁṭi yāsalu kaḍum̐ dagili tīside
tālimidom̐ gadalanādam̐ḍe ghanum̐ḍu
melimi śhrīveṁkaḍeśhumīm̐da bhāramu vesuga
vīlaga tanalo viṭravīm̐guvām̐ḍe nityum̐ḍu