అప్పుడు చూతముగాక ఆఁటదాని బిగువెల్లా
(॥పల్లవి॥)
అప్పుడు చూతముగాక ఆఁటదాని బిగువెల్లా-
నిప్పుడేమి చెప్పేవే ఇందరిలోఁ గతలు
(॥॥)
కూరిమితో రమణునిఁ గొసరి యాడేనంటే
సారె సారె నెన్నిలేవే జాణతనాలు
కోరికోరి నీవాతని గొబ్బుననే వలపించి
నీరువలెఁ గరఁగించ నేరవలెఁ గాక
(॥॥)
నగినగి మగవాని నాఁటఁ జెనకేనంటే
తగఁ జేయ నెన్నిలేవే తరితీపులు
మొగము చూపి విభుని మునుకొని తమి రేఁచి
బిగిసి యింటికిని రప్పించవలెఁ గాక
(॥॥)
శ్రీ వేంకటేశుఁ గూడి చెలఁగి మెప్పించేనంటే
వేవేగ నెన్నిలేవే వింతరతులు
యీవేళ నన్నేలినాఁడు యే నలమేలుమంగను
చేవల నీవూ నతనిఁ జెందవలెఁ గాక
(||pallavi||)
appuḍu sūdamugāga ām̐ṭadāni biguvĕllā-
nippuḍemi sĕppeve iṁdarilom̐ gadalu
(||||)
kūrimido ramaṇunim̐ gŏsari yāḍenaṁṭe
sārĕ sārĕ nĕnnileve jāṇadanālu
korigori nīvādani gŏbbunane valabiṁchi
nīruvalĕm̐ garam̐giṁcha neravalĕm̐ gāga
(||||)
naginagi magavāni nām̐ṭam̐ jĕnagenaṁṭe
tagam̐ jeya nĕnnileve taridībulu
mŏgamu sūbi vibhuni munugŏni tami rem̐si
bigisi yiṁṭigini rappiṁchavalĕm̐ gāga
(||||)
śhrī veṁkaḍeśhum̐ gūḍi sĕlam̐gi mĕppiṁchenaṁṭe
vevega nĕnnileve viṁtaradulu
yīveḽa nannelinām̐ḍu ye nalamelumaṁganu
sevala nīvū nadanim̐ jĕṁdavalĕm̐ gāga