అప్పుడు పరాకైవుండె నది యెఱఁగవు నీవు
(॥పల్లవి॥)
అప్పుడు పరాకైవుండె నది యెఱఁగవు నీవు
ఇప్పు డాకె గనుఁగొని యేమనునో ఇఁకను
(॥అప్పు॥)
కప్పురపువసంతము కలికి నీపై నాడఁగా
డప్పిదేరె నక్కడిబడతలిక వాసె
కొప్పు ముడుచుకో ఇఁకఁ గొనగొంగు చెరువుకో
చొప్పు లాపె గంటేను సూడువట్టీ నిన్నును
(॥అప్పు॥)
గక్కన నీవు రాఁగానే కాంత పన్నీరు చల్లఁగా
చెక్కుచెమటెల్లా జారె సేదలుదేరె
చక్కదిద్దుకో నామము చందన మలఁదుకో
వెక్క సాలివెల్లాఁ గంటే వెంగెమాడీ నిన్నును
(॥అప్పు॥)
దగ్గర నీవు గూచుండేతరి పూవుల వేయఁగా
కగ్గియలంత దేరె కాకలు మానె
యెగ్గులేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
సిగ్గరి యాపె గంటేను చిమ్మరేఁచీ నిన్నును
(||pallavi||)
appuḍu parāgaivuṁḍĕ nadi yĕṟam̐gavu nīvu
ippu ḍāgĕ ganum̐gŏni yemanuno im̐kanu
(||appu||)
kappurabuvasaṁtamu kaligi nībai nāḍam̐gā
ḍappiderĕ nakkaḍibaḍadaliga vāsĕ
kŏppu muḍusugo im̐kam̐ gŏnagŏṁgu sĕruvugo
sŏppu lābĕ gaṁṭenu sūḍuvaṭṭī ninnunu
(||appu||)
gakkana nīvu rām̐gāne kāṁta pannīru sallam̐gā
sĕkkusĕmaḍĕllā jārĕ sedaluderĕ
sakkadiddugo nāmamu saṁdana malam̐dugo
vĕkka sālivĕllām̐ gaṁṭe vĕṁgĕmāḍī ninnunu
(||appu||)
daggara nīvu gūsuṁḍedari pūvula veyam̐gā
kaggiyalaṁta derĕ kāgalu mānĕ
yĕggulega śhrīveṁkaḍeśha nannu nelidivi
siggari yābĕ gaṁṭenu simmarem̐sī ninnunu