అప్పుడు నీవు నవ్వితి వౌనోకాదో
(॥పల్లవి॥)
అప్పుడు నీవు నవ్వితి వౌనోకాదో
చొప్పులు సోరణగండ్లఁ జూచితి నావేళను
(॥అప్పుడుల॥)
వనిత చన్నుల మీఁది వాసన కస్తూరి పూఁత
మునుప నీవురముపై ముద్రలంటెను
వెనకనొక్కతె వచ్చి వెఁస గాఁగిలించుకొంటే
తన చన్నుల నంటితే తాఁదెలిసి తిట్టెను
(॥అప్పుడుల॥)
తరుణివుపరిసురతపువేళ మెడదండ
గిరికొని నీమెడఁ దగిలియుండఁగగా
తరువాత వేరొకతె తా నీరతికి కిందై
మరలి దండ దగుల మరి నిన్నుఁ దిట్టెను
(॥అప్పుడు్॥)
అలమేలుమంగ చెమటట్టే నీమేనిపైఁ జింది
చెలఁగి శ్రీ వెంకటేశ చిప్పిలుండఁగా
కలసి తులసీదేవి కాఁగిలించి ఆనీట
మెలుపునఁ దొప్పఁదోఁగి మెచ్చిమెచ్చి తిట్టెను
(||pallavi||)
appuḍu nīvu navvidi vaunogādo
sŏppulu soraṇagaṁḍlam̐ jūsidi nāveḽanu
(||appuḍula||)
vanida sannula mīm̐di vāsana kastūri pūm̐ta
munuba nīvuramubai mudralaṁṭĕnu
vĕnaganŏkkadĕ vachchi vĕm̐sa gām̐giliṁchugŏṁṭe
tana sannula naṁṭide tām̐dĕlisi tiṭṭĕnu
(||appuḍula||)
taruṇivubarisuradabuveḽa mĕḍadaṁḍa
girigŏni nīmĕḍam̐ dagiliyuṁḍam̐gagā
taruvāda verŏgadĕ tā nīradigi kiṁdai
marali daṁḍa dagula mari ninnum̐ diṭṭĕnu
(||appuḍu్||)
alamelumaṁga sĕmaḍaṭṭe nīmenibaim̐ jiṁdi
sĕlam̐gi śhrī vĕṁkaḍeśha sippiluṁḍam̐gā
kalasi tulasīdevi kām̐giliṁchi ānīḍa
mĕlubunam̐ dŏppam̐dom̐gi mĕchchimĕchchi tiṭṭĕnu