అప్పుడు నీవేమనేవు అంత పనులైన మీఁద
(॥పల్లవి॥)
అప్పుడు నీవేమనేవు అంత పనులైన మీఁద
రెప్పలెత్తి చూచితేను రేసు వోదు గదరా
(॥అప॥)
జవ్వనాన వాడలోని సతులు పిలువకుంటే
యెవ్వతెనైనాఁ దిట్టేవేరా నీవు
అవ్వలనుఁ గోపకత్తె యైనది ఒకతె నిన్ను
దవ్వుల నేమిసేసినా దక్కిపోవు గదరా
(॥అప॥)
సంగడిఁ గూచుండి నీతో సరసములాడరంటా
అంగనల పగచాటేవవురా నీవు
బంగపెట్టి వేరొకతె పగదీర సూడువట్టి
యెంగిలితమ్మ వేసితే నెట్టవునో కదరా
(॥అప॥)
యేక తాన నీసుద్దు లెవ్వరు నెరఁగరంటా
కాకుసేసే వాడువారిఁ గానీరా వోరి
కైకొని శ్రీవేంకటేశ కలిసితివిట్టె నన్ను
లోకులెవ్వరు నవ్విన లోనౌదు గదరా
(||pallavi||)
appuḍu nīvemanevu aṁta panulaina mīm̐da
rĕppalĕtti sūsidenu resu vodu gadarā
(||aba||)
javvanāna vāḍaloni sadulu piluvaguṁṭe
yĕvvadĕnainām̐ diṭṭeverā nīvu
avvalanum̐ gobagattĕ yainadi ŏgadĕ ninnu
davvula nemisesinā dakkibovu gadarā
(||aba||)
saṁgaḍim̐ gūsuṁḍi nīdo sarasamulāḍaraṁṭā
aṁganala pagasāḍevavurā nīvu
baṁgabĕṭṭi verŏgadĕ pagadīra sūḍuvaṭṭi
yĕṁgilidamma veside nĕṭṭavuno kadarā
(||aba||)
yega tāna nīsuddu lĕvvaru nĕram̐garaṁṭā
kāgusese vāḍuvārim̐ gānīrā vori
kaigŏni śhrīveṁkaḍeśha kalisidiviṭṭĕ nannu
logulĕvvaru navvina lonaudu gadarā