Appudu nee gunamemchanaidim gaaga

అప్పుడు నీ గుణమెంచనైతిఁ గాక
Language

(॥పల్లవి॥)
అప్పుడు నీ గుణమెంచనైతిఁ గాక
తప్పని నీ చేఁతలెల్ల దక్కెఁగా నీకు

(॥అప్పు॥)
ముచ్చటగానొకమాట ముందట నేనాడితేను
యెచ్చరించి ఆకెకు నాకీసు రేఁచేవు
తచ్చనకాఁడవు వోరి తలరా ఇంకా నాతో
యిచ్చకాలు సేయ వచ్చేవెరఁగనా ఇఁకను

(॥అప్పు॥)
వలచి నీకేకతాన వడిఁ జేసిన సేవలు
బలిమి ఆకెకుఁ జెప్పి పచ్చిసేసేవు
నిలువరా యెమ్మెకాఁడ నీవు మమ్ముఁ జెనకక
కలసేవు వట్టి పొత్తు కాననా నిన్నును

(॥అప॥)
కదిసి నే నిన్ను రతిఁ గాఁగిలించుకుండఁగాను
యెదిటికాపెఁ బిలిచి యింత నవ్వేవు
మొదల శ్రీవేంకటేశ మొక్కలీఁడవౌదువు
తుదకెక్కెఁ బనులెల్ల దొమ్మి యిఁకనేఁటికి

(||pallavi||)
appuḍu nī guṇamĕṁchanaidim̐ gāga
tappani nī sem̐talĕlla dakkĕm̐gā nīgu

(||appu||)
muchchaḍagānŏgamāḍa muṁdaḍa nenāḍidenu
yĕchchariṁchi āgĕgu nāgīsu rem̐sevu
tachchanagām̐ḍavu vori talarā iṁkā nādo
yichchagālu seya vachchevĕram̐ganā im̐kanu

(||appu||)
valasi nīgegadāna vaḍim̐ jesina sevalu
balimi āgĕgum̐ jĕppi pachchisesevu
niluvarā yĕmmĕgām̐ḍa nīvu mammum̐ jĕnagaka
kalasevu vaṭṭi pŏttu kānanā ninnunu

(||aba||)
kadisi ne ninnu radim̐ gām̐giliṁchuguṁḍam̐gānu
yĕdiḍigābĕm̐ bilisi yiṁta navvevu
mŏdala śhrīveṁkaḍeśha mŏkkalīm̐ḍavauduvu
tudagĕkkĕm̐ banulĕlla dŏmmi yim̐kanem̐ṭigi