అప్పుడు నే నెంత గబ్బి ననవద్దు
(॥పల్లవి॥)
అప్పుడు నే నెంత గబ్బి ననవద్దు
తప్పదు లగ్గము నీపైఁ దగిలింతుఁ జువ్మిూ
(॥అపడు॥)
భారపు నాకుచములు పట్టరాని వేఁ గంటా
వూరకైనా సారె సారె వుప్పటించేవు
వోరి నీ సొపెన దాఁకి వొగిఁ బిక్కటిల్లుఁ జేసు
చేరి చేరి నీమీఁది చేయి దియ్యఁ జుమ్మీ
(॥అపడు॥)
యెలమి నాతురుమిది యెంత ఘనమాయెనంటా
పలుమారుఁ జూచి చూచి పచ్చారేవు
వెలయు నీ దృషి దాఁకె వీడుఁ జేసు నీ వెంత
పొలసి దాఁగిన నిన్నుఁ బోనియ్య జుమ్మీ
(॥అపడు॥)
యిప్పు డిట్టె శ్రీవేంకటేశుఁడ నన్నుఁ గూడి
పిప్పిగా నామోవి గడు బిందువుచ్చేవు
చిప్పిలు నీ పలు సోఁకి చిల్లివోవుఁ జేసు నేఁ
జెప్పితి నీ చేఁతలకు చేఁత సేతుఁ జుమ్మీ
(||pallavi||)
appuḍu ne nĕṁta gabbi nanavaddu
tappadu laggamu nībaim̐ dagiliṁtum̐ juvmiూ
(||abaḍu||)
bhārabu nāgusamulu paṭṭarāni vem̐ gaṁṭā
vūragainā sārĕ sārĕ vuppaḍiṁchevu
vori nī sŏbĕna dām̐ki vŏgim̐ bikkaḍillum̐ jesu
seri seri nīmīm̐di seyi diyyam̐ jummī
(||abaḍu||)
yĕlami nādurumidi yĕṁta ghanamāyĕnaṁṭā
palumārum̐ jūsi sūsi pachchārevu
vĕlayu nī dṛṣhi dām̐kĕ vīḍum̐ jesu nī vĕṁta
pŏlasi dām̐gina ninnum̐ boniyya jummī
(||abaḍu||)
yippu ḍiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa nannum̐ gūḍi
pippigā nāmovi gaḍu biṁduvuchchevu
sippilu nī palu som̐ki sillivovum̐ jesu nem̐
jĕppidi nī sem̐talagu sem̐ta sedum̐ jummī