అప్పుడు నమ్మేవు నీవు అన్నిఁ దారుకాణలైతే
(॥పల్లవి॥)
అప్పుడు నమ్మేవు నీవు అన్నిఁ దారుకాణలైతే
ఇప్పుడు నీతో మాకు నేఁటికి వాదించను
(॥అప్పు॥)
నీమోవిపై నించె నాపె నెయ్యమెల్లాను
కామించి నీవేల యెఱఁగవోకాని
దోమటి మాకైతే నిది తోడ దిష్టము
ఆమాట నిజమూఁ గల్లా నాపెనే యడుగుమా
(॥అప్పు॥)
వువిదవలపులు నీవొళ్ల నించెను
అవల నీకేల తెలియదో కాని
వివరించి మాకుఁజాడ వెల్లావిరులు
తవిలి నీకిష్టమైనతరుణి నడుగుమా
(॥అప్పు॥)
ముంచి నీమన్నన వురమున నించెను
అంచేలశ్రీవేంకటేశ అలమేల్మంగ
చంచులమీకూటములు సరివచ్చెను
యెంచఁగ మమ్మేలితిరి యింతినే యడుగుమా
(||pallavi||)
appuḍu nammevu nīvu annim̐ dārugāṇalaide
ippuḍu nīdo māgu nem̐ṭigi vādiṁchanu
(||appu||)
nīmovibai niṁchĕ nābĕ nĕyyamĕllānu
kāmiṁchi nīvela yĕṟam̐gavogāni
domaḍi māgaide nidi toḍa diṣhṭamu
āmāḍa nijamūm̐ gallā nābĕne yaḍugumā
(||appu||)
vuvidavalabulu nīvŏḽla niṁchĕnu
avala nīgela tĕliyado kāni
vivariṁchi māgum̐jāḍa vĕllāvirulu
tavili nīgiṣhṭamainadaruṇi naḍugumā
(||appu||)
muṁchi nīmannana vuramuna niṁchĕnu
aṁchelaśhrīveṁkaḍeśha alamelmaṁga
saṁchulamīgūḍamulu sarivachchĕnu
yĕṁcham̐ga mammelidiri yiṁtine yaḍugumā