Appudu gaani kaanaraa daayamulum baayamulu

అప్పుడు గాని కానరా దాయములుఁ బాయములు
Language

(॥పల్లవి॥)
అప్పుడు గాని కానరా దాయములుఁ బాయములు
రెప్పలెత్తి చూడఁగానే రేసు లింకా నేలరా

(॥॥)
వచ్చివచ్చి మామీఁద వలుపే చల్లేవుగాని
చొచ్చి నారతిఁ జెనకి చూడలేలరా
మచ్చికల నాలోనిమనసే చూచేవుగాని
ముచ్చట నీతేనేగారేమోవి ఇయ్యవేలరా

(॥॥)
మాటకు మునుపనే మందులు నూరేవుగాని
గాఁటపుగుబ్బలకు దగ్గరవేలరా
చీటికి మాటికి నాతో సిగ్గులే పడేవుగాని
నాటని సెలవులను నవ్వ వింక నేలరా

(॥॥)
చట్టనికాఁగిటిలోన చవులే చెప్పేవుగాని
అల్లిబిల్లై తగుఁదగదన వేలరా
యెల్లగా శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
బల్లిదఁడు నిమిషముఁ బాయ విఁక నేలరా

(||pallavi||)
appuḍu gāni kānarā dāyamulum̐ bāyamulu
rĕppalĕtti sūḍam̐gāne resu liṁkā nelarā

(||||)
vachchivachchi māmīm̐da valube sallevugāni
sŏchchi nāradim̐ jĕnagi sūḍalelarā
machchigala nālonimanase sūsevugāni
muchchaḍa nīdenegāremovi iyyavelarā

(||||)
māḍagu munubane maṁdulu nūrevugāni
gām̐ṭabugubbalagu daggaravelarā
sīḍigi māḍigi nādo siggule paḍevugāni
nāḍani sĕlavulanu navva viṁka nelarā

(||||)
saṭṭanigām̐giḍilona savule sĕppevugāni
allibillai tagum̐dagadana velarā
yĕllagā śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
ballidam̐ḍu nimiṣhamum̐ bāya vim̐ka nelarā