అప్పుడు దామే కూడి రంతరంగా లెనసి
(॥పల్లవి॥)
అప్పుడు దామే కూడి రంతరంగా లెనసి
దప్పితోడ రమణుఁడు తమకించీ నిపుడు
(॥అప్పు॥)
మొనగోరి వ్రాఁతతోడ మోమువంచి యాపె నీతో
యెనలేక మాటలాడీ నెంతవడైన
పెనఁగి తాఁ గూడదు పిరితీసివుండలేదు
మనవి నిద్దరికేడ మాటలాడఁగదరే
(॥అప్పు॥)
కిందిచూపులతోడను కెరలుచుఁ జెమరించి
అందిచ్చీ విడెము పతి కప్పటనుండి
పొందులకుఁ బెనఁగదు పొలయక మానదు
చందముల నిద్దరికి సంతత్సము సేయరే
(॥అప్పు॥)
సెలవినవ్వులతోడఁజెక్కులెల్లాఁ బులకించె
కలసి కాఁగిలి చీఁ గాఁక్షల నీకె
యెలమి శ్రీవేంకటేశుఁ డీపె నిట్టె యేలెను
చలివాసె లోలోనే చనవు లిప్పించరే
(||pallavi||)
appuḍu dāme kūḍi raṁtaraṁgā lĕnasi
dappidoḍa ramaṇum̐ḍu tamagiṁchī nibuḍu
(||appu||)
mŏnagori vrām̐tadoḍa momuvaṁchi yābĕ nīdo
yĕnalega māḍalāḍī nĕṁtavaḍaina
pĕnam̐gi tām̐ gūḍadu piridīsivuṁḍaledu
manavi niddarigeḍa māḍalāḍam̐gadare
(||appu||)
kiṁdisūbuladoḍanu kĕralusum̐ jĕmariṁchi
aṁdichchī viḍĕmu padi kappaḍanuṁḍi
pŏṁdulagum̐ bĕnam̐gadu pŏlayaga mānadu
saṁdamula niddarigi saṁtatsamu seyare
(||appu||)
sĕlavinavvuladoḍam̐jĕkkulĕllām̐ bulagiṁchĕ
kalasi kām̐gili sīm̐ gām̐kṣhala nīgĕ
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍībĕ niṭṭĕ yelĕnu
salivāsĕ lolone sanavu lippiṁchare