అప్పుడేవిూ ననకువిూ ఆయము లెందు మోచునో
(॥పల్లవి॥)
అప్పుడేవిూ ననకువిూ ఆయము లెందు మోచునో
చొప్పులెత్తీ నిదిగో యే చుట్టరికమో కాని
(॥అప్పుడేవిూ॥)
నెలఁత యిదెవ్వతే నీవంటిదే మొగము
అలరు నీ చెల్లెలో అక్కో కాని
కొలచి చూచితే నీ గుబ్బలవంటివే యీకె
బలిమి చన్నుల కొక్కవడి యచ్చో కాని
(॥అప్పుడేవిూ॥)
తరుణి యెందుండి వచ్చె తగు నీ పోలికెలది
గరిమ నీ ప్రతిరూపో కరుగో కాని
సరసఁ బెట్టి చూచితే చాయ లొక్కరీతివే
సరిఁ గనుఁగల్వ లొక్కసరసివో కాని
(॥అప్పుడేవిూ॥)
వువిద యెట్టు వొడిమె వొక్కట నీ బాగులది
ఆవలమేనినీదో అమడో కాని
తవిలి కూడితి రిట్టే తానె శ్రీవేంకటేశుఁడ
యివల మీ వలపు లొక్క యెత్తువో కాని
(||pallavi||)
appuḍeviూ nanaguviూ āyamu lĕṁdu mosuno
sŏppulĕttī nidigo ye suṭṭarigamo kāni
(||appuḍeviూ||)
nĕlam̐ta yidĕvvade nīvaṁṭide mŏgamu
alaru nī sĕllĕlo akko kāni
kŏlasi sūside nī gubbalavaṁṭive yīgĕ
balimi sannula kŏkkavaḍi yachcho kāni
(||appuḍeviూ||)
taruṇi yĕṁduṁḍi vachchĕ tagu nī poligĕladi
garima nī pradirūbo karugo kāni
sarasam̐ bĕṭṭi sūside sāya lŏkkarīdive
sarim̐ ganum̐galva lŏkkasarasivo kāni
(||appuḍeviూ||)
vuvida yĕṭṭu vŏḍimĕ vŏkkaḍa nī bāguladi
āvalameninīdo amaḍo kāni
tavili kūḍidi riṭṭe tānĕ śhrīveṁkaḍeśhum̐ḍa
yivala mī valabu lŏkka yĕttuvo kāni