Appude yeṟamganaidi nanavaddu

అప్పుడే యెఱఁగనైతి ననవద్దు
Language

(॥పల్లవి॥)
అప్పుడే యెఱఁగనైతి ననవద్దు
తప్పక రక్షించేటి పెద్దరికము సుమ్మీ

(॥॥)
పట్టిన చలము తోడి పంతగాఁడవు నీవు
రట్టుసేయకుమీ రతిదిట్టను నేను
ఇట్టిదొరఁ గాఁ జేసి యేలుకొంటివి
నెట్టన బేరుఁగీరితి నీదేసుమ్మీ

(॥॥)
ఇన్నిటా బలిమిచూపే యెమ్మొగాడవు నీవు
చన్నుల జీర దియ్యకు సతిని నేను
పిన్ననాడే మరిగించి పెండ్లాడితివి
ఇన్నిటా మన్నించుటే యెక్కుడుసుమ్మీ

(॥॥)
వెఱపు లేని పొందుల వేడుకకాఁడవు నీవు
మఱవకుమీ యలమేల్మంగను నేను
గుఱిగా శ్రీ వేంకటేశ కూడితివి
మెఱయ నాపైకరుణ మేలేసుమ్మీ

(||pallavi||)
appuḍe yĕṟam̐ganaidi nanavaddu
tappaga rakṣhiṁcheḍi pĕddarigamu summī

(||||)
paṭṭina salamu toḍi paṁtagām̐ḍavu nīvu
raṭṭuseyagumī radidiṭṭanu nenu
iṭṭidŏram̐ gām̐ jesi yelugŏṁṭivi
nĕṭṭana berum̐gīridi nīdesummī

(||||)
inniḍā balimisūbe yĕmmŏgāḍavu nīvu
sannula jīra diyyagu sadini nenu
pinnanāḍe marigiṁchi pĕṁḍlāḍidivi
inniḍā manniṁchuḍe yĕkkuḍusummī

(||||)
vĕṟabu leni pŏṁdula veḍugagām̐ḍavu nīvu
maṟavagumī yalamelmaṁganu nenu
guṟigā śhrī veṁkaḍeśha kūḍidivi
mĕṟaya nābaigaruṇa melesummī