Appude yemtagu vachche naderaa neevu

అప్పుడే యెంతకు వచ్చె నదేరా నీవు
Language

(॥పల్లవి॥)
అప్పుడే యెంతకు వచ్చె నదేరా నీవు
రెప్పలు నే వంచితేనే రేసు వుట్టెఁ బనులు

(॥అప్పుఁ॥)
శిరసువంచి తిట్టి సిగ్గులుమోవఁ జెనకి
అరగన్ను మోడ్చి చూచె వదేరా నీవు
గరిమ నిన్ను జొక్కించి కళలంటి యిందు మారు
సరికిసరి నవ్వితే చక్కనయ్యీఁ బనులు

(॥అప్పుఁ॥)
బొమ్మల నే జంకించి పోకుండా నానలు వెట్టి
అమ్మరో కోపమురేఁచే వదేరా నీవు
తమ్మిమోము సోఁకఁజేసి తలఁపెల్లా మరపించి
కమ్మర సూడు వట్టితే కానవచ్చీ బనులు

(॥అప్పుఁ॥)
బిగువుఁగాఁగిట నించి పెదవిఁబెదవి మోఁపి
అగుడుసేఁతలు సేసే వదేరా నీవు
జిగిదీర నేను నట్టే శ్రీ వేంకటేశ నిన్ను
మగుడఁ గూడితి నింక మంచిదాయఁ బనులు

(||pallavi||)
appuḍe yĕṁtagu vachchĕ naderā nīvu
rĕppalu ne vaṁchidene resu vuṭṭĕm̐ banulu

(||appum̐||)
śhirasuvaṁchi tiṭṭi siggulumovam̐ jĕnagi
aragannu moḍchi sūsĕ vaderā nīvu
garima ninnu jŏkkiṁchi kaḽalaṁṭi yiṁdu māru
sarigisari navvide sakkanayyīm̐ banulu

(||appum̐||)
bŏmmala ne jaṁkiṁchi poguṁḍā nānalu vĕṭṭi
ammaro kobamurem̐se vaderā nīvu
tammimomu som̐kam̐jesi talam̐pĕllā marabiṁchi
kammara sūḍu vaṭṭide kānavachchī banulu

(||appum̐||)
biguvum̐gām̐giḍa niṁchi pĕdavim̐bĕdavi mom̐pi
aguḍusem̐talu sese vaderā nīvu
jigidīra nenu naṭṭe śhrī veṁkaḍeśha ninnu
maguḍam̐ gūḍidi niṁka maṁchidāyam̐ banulu