అప్పుడే వచ్చినదాన నందరిలోన
(॥పల్లవి॥)
అప్పుడే వచ్చినదాన నందరిలోన
వుప్పుఁ గప్పురము సరా వొద్దే నీవు
(॥అప్పు॥)
కన్నులమొక్కతిని కాలూఁ దొక్కితిని
యెన్నికకుఁ దనయాల నింకానేమే
నన్నునేల పిలిచీనే, నాఁడునాఁడే పుచ్చఁబుచ్చఁ
బున్నమలౌతెఱఁగవా పోవే నీవు
(॥అప్పు॥)
చేరువనే వుంటిని సేసాఁ బెట్టితిని
యీరుదియ్యఁ బేనువచ్చు నేలే నీవు
తారుకణ లిప్పుడేలే; తనసుద్ది చెప్పుఁజెప్పఁ
జేరమరాయని చెల్లఁబెట్టేఁబదవే
(॥అప్పు॥)
నీటున నవ్వితిని నెట్టనఁ గూడితిని
యేఁటికి శ్రీవేంకటేశుఁ డేమనీఁ దాను
మూఁటమాట లింతయేల; మోవితేనె లూరనూర
నూటలాయఁ దనకు నే నొద్ది కైతిఁ బదలే
(||pallavi||)
appuḍe vachchinadāna naṁdarilona
vuppum̐ gappuramu sarā vŏdde nīvu
(||appu||)
kannulamŏkkadini kālūm̐ dŏkkidini
yĕnnigagum̐ danayāla niṁkāneme
nannunela pilisīne, nām̐ḍunām̐ḍe puchcham̐buchcham̐
bunnamalaudĕṟam̐gavā pove nīvu
(||appu||)
seruvane vuṁṭini sesām̐ bĕṭṭidini
yīrudiyyam̐ benuvachchu nele nīvu
tārugaṇa lippuḍele; tanasuddi sĕppum̐jĕppam̐
jeramarāyani sĕllam̐bĕṭṭem̐badave
(||appu||)
nīḍuna navvidini nĕṭṭanam̐ gūḍidini
yem̐ṭigi śhrīveṁkaḍeśhum̐ ḍemanīm̐ dānu
mūm̐ṭamāḍa liṁtayela; movidenĕ lūranūra
nūḍalāyam̐ danagu ne nŏddi kaidim̐ badale