అప్పుడే నీ వానతియ్యవైతివి గాక
(॥పల్లవి॥)
అప్పుడే నీ వానతియ్యవైతివి గాక
చెప్పరాని పనులైతే చెవులొగ్గి వినేనా
(॥అప్పు॥)
మక్కువ నీవు చూపఁగా మాటలాడితిఁగాక
కక్కసమై తోఁచితేను గాసిఁబెట్టనా
తక్కక లాలించఁగాను దండనుండితిఁగాక
మిక్కిలి వేసటలైతే మేరతోనే వుండనా
(॥అప్పు॥)
చనవు నీ వియ్యఁగాను సంగడిఁ కూచుంటిఁగాక
మనసు రాకుండితేను మల్లు వోరేనా
వినఁగానే నీ కన్నియు విన్నవించితిఁగాక
ననుచకుండితే గుట్టుననే నీకు మొక్కనా
(॥అప్పు॥)
కందువకు రాఁగాను కాఁగిటఁ గూడితిఁగాక
మందటలాడఁబోతేను మత్సరించేనా
ఇందరిలో శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
అందగారితనమైతే నట్టె నిన్ను నవ్వనా
(||pallavi||)
appuḍe nī vānadiyyavaidivi gāga
sĕpparāni panulaide sĕvulŏggi vinenā
(||appu||)
makkuva nīvu sūbam̐gā māḍalāḍidim̐gāga
kakkasamai tom̐sidenu gāsim̐bĕṭṭanā
takkaga lāliṁcham̐gānu daṁḍanuṁḍidim̐gāga
mikkili vesaḍalaide meradone vuṁḍanā
(||appu||)
sanavu nī viyyam̐gānu saṁgaḍim̐ kūsuṁṭim̐gāga
manasu rāguṁḍidenu mallu vorenā
vinam̐gāne nī kanniyu vinnaviṁchidim̐gāga
nanusaguṁḍide guṭṭunane nīgu mŏkkanā
(||appu||)
kaṁduvagu rām̐gānu kām̐giḍam̐ gūḍidim̐gāga
maṁdaḍalāḍam̐bodenu matsariṁchenā
iṁdarilo śhrī veṁkaḍeśha nannu nelidivi
aṁdagāridanamaide naṭṭĕ ninnu navvanā