అప్పుడే నే నంటిగా అండనుండే నీగుణము
(॥పల్లవి॥)
అప్పుడే నే నంటిగా అండనుండే నీగుణము
అప్పళింతువు కాఁగిట న దేపాటౌను
(॥అప్పు॥)
పేరుకొనకు మంటిఁగా బెట్టి ఇందరిలో మమ్ము
కారణము నీకు నాకుఁ గద్దా యేమైనా
సారె నవ్వకు మంటిఁగా సందుల గొందుల నీవు
వారు వీరుఁ జూచితేను వట్టిరట్టౌఁ బనులు
(॥అప్పు॥)
సన్న సేయకు మంటిఁగా చాలుజాలు నీకు నాకు
కన్నచోట నేమైనఁ గద్దా పని
నన్ను ముట్టికు మంటిఁగా నామన నెఱఁగరు
కన్నవారు విన్నవారు కాకుగా నాడుదురు
(॥అప్పు॥)
మంచ మెక్కకు మంటిఁగా మాటలు చెప్పుదుగాని
కంచముపొత్తు మనకు గద్దా భేదము
పొంచుక శ్రీవేంకటేశ పోనీ కిట్టె కూడితివి
చంచలము లే కదే సతమాయ నిపుడు
(||pallavi||)
appuḍe ne naṁṭigā aṁḍanuṁḍe nīguṇamu
appaḽiṁtuvu kām̐giḍa na debāḍaunu
(||appu||)
perugŏnagu maṁṭim̐gā bĕṭṭi iṁdarilo mammu
kāraṇamu nīgu nāgum̐ gaddā yemainā
sārĕ navvagu maṁṭim̐gā saṁdula gŏṁdula nīvu
vāru vīrum̐ jūsidenu vaṭṭiraṭṭaum̐ banulu
(||appu||)
sanna seyagu maṁṭim̐gā sālujālu nīgu nāgu
kannasoḍa nemainam̐ gaddā pani
nannu muṭṭigu maṁṭim̐gā nāmana nĕṟam̐garu
kannavāru vinnavāru kāgugā nāḍuduru
(||appu||)
maṁcha mĕkkagu maṁṭim̐gā māḍalu sĕppudugāni
kaṁchamubŏttu managu gaddā bhedamu
pŏṁchuga śhrīveṁkaḍeśha ponī kiṭṭĕ kūḍidivi
saṁchalamu le kade sadamāya nibuḍu