అప్పుడే నన్నియుఁ జెప్పే నాతనితోడ
(॥పల్లవి॥)
అప్పుడే నన్నియుఁ జెప్పే నాతనితోడ
వొప్పగు మీ మాటలెల్ల నూఁకొనఁగ వలెఁగా
(॥అప్పు॥)
తేనెలవంటిమాటలు తేటపడెఁగా నేఁడు
తానె యాపె వెంట వెంటఁ దగులఁగాను
కానిలేవే యందు కేమి కంటిని తనగుణాలు
యే నెపాననైఁనా దానే యీడకు రావలెఁగా
(॥అప్పు॥)
కందువ తననిజాలు కానవచ్చెఁగా నేఁడు
కిందుపడాకెకుఁ గన్నుగిరుపఁగాను
సందడించనేలె నాకు చక్క నాయఁ బనులెల్ల
ముందరికిఁ దానె నామోము చూడవలెఁగా
(॥అప్పు॥)
రచ్చలతనవలపు రతికెక్కెఁగా నేఁడు
వొచ్చెము దీరఁ దానే నావొద్దికి రాఁగా
యిచ్చట శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁగూడె
మచ్చరా లిన్నియుఁ బాసె మరుగఁగవలెఁగా
(||pallavi||)
appuḍe nanniyum̐ jĕppe nādanidoḍa
vŏppagu mī māḍalĕlla nūm̐kŏnam̐ga valĕm̐gā
(||appu||)
tenĕlavaṁṭimāḍalu teḍabaḍĕm̐gā nem̐ḍu
tānĕ yābĕ vĕṁṭa vĕṁṭam̐ dagulam̐gānu
kānileve yaṁdu kemi kaṁṭini tanaguṇālu
ye nĕbānanaim̐nā dāne yīḍagu rāvalĕm̐gā
(||appu||)
kaṁduva tananijālu kānavachchĕm̐gā nem̐ḍu
kiṁdubaḍāgĕgum̐ gannugirubam̐gānu
saṁdaḍiṁchanelĕ nāgu sakka nāyam̐ banulĕlla
muṁdarigim̐ dānĕ nāmomu sūḍavalĕm̐gā
(||appu||)
rachchaladanavalabu radigĕkkĕm̐gā nem̐ḍu
vŏchchĕmu dīram̐ dāne nāvŏddigi rām̐gā
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐gūḍĕ
machcharā linniyum̐ bāsĕ marugam̐gavalĕm̐gā