Appude mechchidimi annidaa ninnu

అప్పుడే మెచ్చితిమి అన్నిటా నిన్ను
Language

(॥పల్లవి॥)
అప్పుడే మెచ్చితిమి అన్నిటా నిన్ను
ఇప్పుడే నిన్నుఁ బొగడి యింత సేయవలెనా

(॥అప్పు॥)
చెంది యెక్కడ చూచినాఁ జెప్పరాదు నీనిజము
కందువ నీ మోవిపైనే కానరాదా
ముందే యెఱఁగుదురు ముంచి యసురసతులు
నిందించరాదు నిన్ను నే మెఱఁగవలెనా

(॥అప్పు॥)
ముంచి యెక్కడ చూచినా మోవరాదు నీకూరిమి
యెంచఁగ నీమోము చూచే యెఱఁగరాదా
కొంచక పాసి కూడిన గొల్లెతలే చెప్పేరు
నించి మానోరులు నిండా నేము చెప్పవలెనా

(॥అప్పు॥)
కూరిమెక్కడ చూచినాఁ గొసరరాదు రతిఁ
దేరిన నీకాఁగిటిలోఁ దెలియరాదా
కోరి యలమేల్మంగను గూడితి శ్రీ వేంకటేశ
నేరిపేరు నీ కందరు నేము నేర్పవలెనా

(||pallavi||)
appuḍe mĕchchidimi anniḍā ninnu
ippuḍe ninnum̐ bŏgaḍi yiṁta seyavalĕnā

(||appu||)
sĕṁdi yĕkkaḍa sūsinām̐ jĕpparādu nīnijamu
kaṁduva nī movibaine kānarādā
muṁde yĕṟam̐guduru muṁchi yasurasadulu
niṁdiṁcharādu ninnu ne mĕṟam̐gavalĕnā

(||appu||)
muṁchi yĕkkaḍa sūsinā movarādu nīgūrimi
yĕṁcham̐ga nīmomu sūse yĕṟam̐garādā
kŏṁchaga pāsi kūḍina gŏllĕdale sĕpperu
niṁchi mānorulu niṁḍā nemu sĕppavalĕnā

(||appu||)
kūrimĕkkaḍa sūsinām̐ gŏsararādu radim̐
derina nīgām̐giḍilom̐ dĕliyarādā
kori yalamelmaṁganu gūḍidi śhrī veṁkaḍeśha
neriberu nī kaṁdaru nemu nerbavalĕnā