Appude krtaardhumdu appude logaboojyumdu

అప్పుడే కృతార్థుఁడు అప్పుడే లోకపూజ్యుఁడు
Language

(॥పల్లవి॥)
అప్పుడే కృతార్థుఁడు అప్పుడే లోకపూజ్యుఁడు
తప్పు లేదు ముప్పు లేదు దైవమే గురుతు

(॥అపడే॥)
ఎవ్వఁడు పుణ్యుఁడు గాఁడు యెవ్వఁడు పాతకి గాఁడు
యివ్వలఁ దొంటి జన్మము లెంచి చూచితే
నెవ్వగనీ జీవునికీ నేరుపేది నేర మేది
అవ్వల శ్రీహరి శరణన్నదే గురుతు

(॥అపడే॥)
పుట్టని కులము లేవి భుజించని వస్తువేది
యిట్టే యీ జీవుల నెల్లా యెంచి చూచితే
గుట్టు దెలిసితి మిందు కొంచమేది దొడ్డ యేది
అట్టు నిట్టు హరిదాసుఁ డైనదే గురుతు

(॥అపడే॥)
ఎఱిఁగి సేసు టేది యెఱుఁగక మానుటేది
తఱిఁ బ్రపంచమునందుఁ దలపోసితే
మెఱయ పరుస మంటే మఱి పైఁడే మిను మేమి
గుఱిగా శ్రీ వేంకటేశుఁ గొలుచుటే గురుతు

(||pallavi||)
appuḍe kṛtārdhum̐ḍu appuḍe logabūjyum̐ḍu
tappu ledu muppu ledu daivame gurudu

(||abaḍe||)
ĕvvam̐ḍu puṇyum̐ḍu gām̐ḍu yĕvvam̐ḍu pādagi gām̐ḍu
yivvalam̐ dŏṁṭi janmamu lĕṁchi sūside
nĕvvaganī jīvunigī nerubedi nera medi
avvala śhrīhari śharaṇannade gurudu

(||abaḍe||)
puṭṭani kulamu levi bhujiṁchani vastuvedi
yiṭṭe yī jīvula nĕllā yĕṁchi sūside
guṭṭu dĕlisidi miṁdu kŏṁchamedi dŏḍḍa yedi
aṭṭu niṭṭu haridāsum̐ ḍainade gurudu

(||abaḍe||)
ĕṟim̐gi sesu ṭedi yĕṟum̐gaga mānuḍedi
taṟim̐ brabaṁchamunaṁdum̐ dalaboside
mĕṟaya parusa maṁṭe maṟi paim̐ḍe minu memi
guṟigā śhrī veṁkaḍeśhum̐ gŏlusuḍe gurudu