Appude kaanamgavachchee naumgaamu lellaanu

అప్పుడే కానఁగవచ్చీ నౌఁగాము లెల్లాను
Language

(॥పల్లవి॥)
అప్పుడే కానఁగవచ్చీ నౌఁగాము లెల్లాను
చిప్పిలు జవ్వనముపై చేయివెట్టరాదా

(॥అప్పు॥)
చండి పోరి నీవు నాతో సాములేల సేసేవు
వుండఁ బట్టదా నీకు నోజతోడను
కండగర్వ మెంతే నీకు గలికితేఁగనక యీ -
కొండలవంటి చన్నులు కుచ్చి యెత్తరాదా

(॥అప్పు॥)
గుట్టుతోడ నవ్వు నవ్వి గురులేల వేసేవు
పట్టరాదా నీవొళ్లిపాయము నేఁడుఁ
బట్టబయ లీఁదేనని పంతము నీకింత గల్తే
కిట్టి నా నడుము పిడికిటఁ బట్టరాదా

(॥అప్పు॥)
తలపోసి నన్ను నిట్టె తమకించి కూడేవు
నిలువరాదా మనసు నీయంత నీకు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
అలమేలుమంగ నేను అక్కువ నించరాదా

(||pallavi||)
appuḍe kānam̐gavachchī naum̐gāmu lĕllānu
sippilu javvanamubai seyivĕṭṭarādā

(||appu||)
saṁḍi pori nīvu nādo sāmulela sesevu
vuṁḍam̐ baṭṭadā nīgu nojadoḍanu
kaṁḍagarva mĕṁte nīgu galigidem̐ganaga yī -
kŏṁḍalavaṁṭi sannulu kuchchi yĕttarādā

(||appu||)
guṭṭudoḍa navvu navvi gurulela vesevu
paṭṭarādā nīvŏḽlibāyamu nem̐ḍum̐
baṭṭabaya līm̐denani paṁtamu nīgiṁta galde
kiṭṭi nā naḍumu piḍigiḍam̐ baṭṭarādā

(||appu||)
talabosi nannu niṭṭĕ tamagiṁchi kūḍevu
niluvarādā manasu nīyaṁta nīgu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
alamelumaṁga nenu akkuva niṁcharādā