అప్పుడే బలిమి సేసే వందు కేమి
(॥పల్లవి॥)
అప్పుడే బలిమి సేసే వందు కేమి
చిప్పిలఁ బనివనిగాఁ జెప్పర నాతోను
(॥అప్పుడే॥)
వోప నంటాఁ బెనగఁగ వొడివట్టి తియ్యకురా
కోపపుఁ జూపులు కనుఁగొనే వారము
చేపట్టి తీదీపులను చేయి దాఁకు గాలు దాఁకు
ఆఁపి మాట మాటగాఁనె ఆడరా నాతోను
(॥అప్పుడే॥)
పెడమర లుండఁగాను పేరునఁ బిలవకురా
వడి మురిపెముల గర్వపువారమూ
తడవఁగఁ బలుమారు తప్పు లౌనో వొప్పు లౌనో
నడుమ నవ్వు నవ్వుగ నవ్వరా నాతోను
(॥అప్పుడే॥)
పవళించి వుండగాను పైపైఁ బడే వ దేమిరా
చివురేచేఁ గల గోరిచేతివారము
యివల శ్రీవెంకటేశ యిట్టె కూడితిని నన్ను
చవిగా ముద్దుముద్దుగాఁ జన వీరా నాకునూ
(||pallavi||)
appuḍe balimi sese vaṁdu kemi
sippilam̐ banivanigām̐ jĕppara nādonu
(||appuḍe||)
voba naṁṭām̐ bĕnagam̐ga vŏḍivaṭṭi tiyyagurā
kobabum̐ jūbulu kanum̐gŏne vāramu
sebaṭṭi tīdībulanu seyi dām̐ku gālu dām̐ku
ām̐pi māḍa māḍagām̐nĕ āḍarā nādonu
(||appuḍe||)
pĕḍamara luṁḍam̐gānu perunam̐ bilavagurā
vaḍi muribĕmula garvabuvāramū
taḍavam̐gam̐ balumāru tappu launo vŏppu launo
naḍuma navvu navvuga navvarā nādonu
(||appuḍe||)
pavaḽiṁchi vuṁḍagānu paibaim̐ baḍe va demirā
sivuresem̐ gala gorisedivāramu
yivala śhrīvĕṁkaḍeśha yiṭṭĕ kūḍidini nannu
savigā muddumuddugām̐ jana vīrā nāgunū