అప్పుడన్నీఁ జెప్పేఁగాని అందరిముందర నేలా
(॥పల్లవి॥)
అప్పుడన్నీఁ జెప్పేఁగాని అందరిముందర నేలా
దెప్పరాన నిట్టే పట్టుతెర వేసేమయ్యా
(॥అప్పు॥)
మొగములోపలిసిగ్గు మోవివెంట నవ్వులాయ
చిగురులోపలిచింత చెక్కుచేయాయ
మగువ నప్పటి నీవు మాఁటలేమి యడిగేవు
అగడుసేయక యేకాంత మియ్యవయ్యా
(॥అప్పు॥)
చేతులఁగారే చెమట చీరకొంగు దడిసెను
కాతరపుఁజూపు కడకన్నులఁ దేరె
యేతుల నీపెను నీవు యేల వెడ్డువెట్టేవు
జాతులు సేయక రహస్యానఁ జెనకవయ్యా
(॥అప్పు॥)
పట్టినపాయపుమీఁద పై పై నీకే సెలవాయ
తొట్టినవలపులెల్ల దోమటాయను
యిట్టె శ్రీవేంకటేశ యెనసితి వింతి నిట్టె
దట్టముగా నీవు మంతన మానతీవయ్యా
(||pallavi||)
appuḍannīm̐ jĕppem̐gāni aṁdarimuṁdara nelā
dĕpparāna niṭṭe paṭṭudĕra vesemayyā
(||appu||)
mŏgamulobalisiggu movivĕṁṭa navvulāya
sigurulobalisiṁta sĕkkuseyāya
maguva nappaḍi nīvu mām̐ṭalemi yaḍigevu
agaḍuseyaga yegāṁta miyyavayyā
(||appu||)
sedulam̐gāre sĕmaḍa sīragŏṁgu daḍisĕnu
kādarabum̐jūbu kaḍagannulam̐ derĕ
yedula nībĕnu nīvu yela vĕḍḍuvĕṭṭevu
jādulu seyaga rahasyānam̐ jĕnagavayyā
(||appu||)
paṭṭinabāyabumīm̐da pai pai nīge sĕlavāya
tŏṭṭinavalabulĕlla domaḍāyanu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidi viṁti niṭṭĕ
daṭṭamugā nīvu maṁtana mānadīvayyā