Appudainaa samtosamaunaa neegu

అప్పుడైనా సంతోసమౌనా నీకు
Language

(॥పల్లవి॥)
అప్పుడైనా సంతోసమౌనా నీకు
యెప్పుడుఁ గూటమికంటె నిదియే మేలు

(॥అప్పు॥)
యిప్పడు నీగుణము నే నెఱిఁగి కమ్మర నీ -
కప్పినవలలకుఁ జిక్కకపోదు
యిప్పటి యీవెదఁ బొందేయిందుకంటే నామోహ-
మొప్పగించి వొక్కచోట నుండుటే మేలు

(॥అప్పు॥)
ఇటువంటినీవెకా నేనెంత నిన్నుఁ గొసరి
అటని నాతమక మాఁపలేను
చిటిపొటియలుకల చిందువందై యుండుకంటె
తటుకునఁ దెగువైనతలపోఁతే మేలు

(॥అప్పు॥)
విన్నవేపో తొల్లియు శ్రీవేంకటేశ నాలో-
నెన్ని యిట్టె నిన్నుఁ గూడి యెడయలేను
మన్ననరతుల మైమఱచి నే నుండుకంటె
వున్నతి నీగోరితాఁకు కోరుచుటే మేలు

(||pallavi||)
appuḍainā saṁtosamaunā nīgu
yĕppuḍum̐ gūḍamigaṁṭĕ nidiye melu

(||appu||)
yippaḍu nīguṇamu ne nĕṟim̐gi kammara nī -
kappinavalalagum̐ jikkagabodu
yippaḍi yīvĕdam̐ bŏṁdeyiṁdugaṁṭe nāmoha-
mŏppagiṁchi vŏkkasoḍa nuṁḍuḍe melu

(||appu||)
iḍuvaṁṭinīvĕgā nenĕṁta ninnum̐ gŏsari
aḍani nādamaga mām̐palenu
siḍibŏḍiyalugala siṁduvaṁdai yuṁḍugaṁṭĕ
taḍugunam̐ dĕguvainadalabom̐te melu

(||appu||)
vinnavebo tŏlliyu śhrīveṁkaḍeśha nālo-
nĕnni yiṭṭĕ ninnum̐ gūḍi yĕḍayalenu
mannanaradula maimaṟasi ne nuṁḍugaṁṭĕ
vunnadi nīgoridām̐ku korusuḍe melu