అప్పుడాతని కిల్లాల వైతివి గదే
(॥పల్లవి॥)
అప్పుడాతని కిల్లాల వైతివి గదే
దప్పిదేరె నిఁకను మా దండనే వుండఁగదే
(॥అప॥)
పెచ్చురేఁగి నిన్నాతఁడు పేరునఁ బిలిచె నిఁక
విచ్చనవిడేయఁ గదె వెలఁది నీకు
కచ్చుపెట్టి యప్పటిని కన్నులఁ జూచె నిన్ను
యిచ్చటనే నీకోరికె లీడేరెఁ గదవే
(॥అప॥)
చిత్తగించి యింతలోనే సెలవుల నవ్వెఁ బతి
అత్తుగడలాయఁ గదే యంగన నీకు
పొత్తులకు రమ్మని పొందులు చూపె నిట్టే
బత్తిగలదానవు నీభాగ్యములాయఁ గదే
(॥అప॥)
శ్రీవేంకటేశుఁడు నన్నుఁ జేరి కూడి నిన్ను నేలె
వావులు గలసెఁ గదే వనిత నీకు
భావించి నాకు నీచేఁ బంతములెల్లా నిప్పించె
చేవమీఱ నిందరిలోఁ జెప్పఁగలిగెఁ గదే
(||pallavi||)
appuḍādani killāla vaidivi gade
dappiderĕ nim̐kanu mā daṁḍane vuṁḍam̐gade
(||aba||)
pĕchchurem̐gi ninnādam̐ḍu perunam̐ bilisĕ nim̐ka
vichchanaviḍeyam̐ gadĕ vĕlam̐di nīgu
kachchubĕṭṭi yappaḍini kannulam̐ jūsĕ ninnu
yichchaḍane nīgorigĕ līḍerĕm̐ gadave
(||aba||)
sittagiṁchi yiṁtalone sĕlavula navvĕm̐ badi
attugaḍalāyam̐ gade yaṁgana nīgu
pŏttulagu rammani pŏṁdulu sūbĕ niṭṭe
battigaladānavu nībhāgyamulāyam̐ gade
(||aba||)
śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐ jeri kūḍi ninnu nelĕ
vāvulu galasĕm̐ gade vanida nīgu
bhāviṁchi nāgu nīsem̐ baṁtamulĕllā nippiṁchĕ
sevamīṟa niṁdarilom̐ jĕppam̐galigĕm̐ gade