అప్పు డెట్టుండెనో చిత్త మయ్యో యెఱఁగనైతి
(॥పల్లవి॥)
అప్పు డెట్టుండెనో చిత్త మయ్యో యెఱఁగనైతి
చెప్పుడుమాటలకే నేఁ జేరనైతిఁగా
(॥అప్పు॥)
కొసరికొసరి నీపై కోపమున నుంటిఁగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిఁగా
పసలేని సిగ్గుతోడిపంతాననే వుంటిఁగాని
ముసిముసినవ్వుమోవి మోపనైతిఁగా
(॥అప్పు॥)
విరహపుఁగాఁకల నావిసుపే చూపితిఁగాని
సరిఁ బిల్చితే నూఁకొనఁజాలనైతిఁగా
వరుసవంతులకై నే వాదులాడితిఁగాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిఁగా
(॥అప్పు॥)
వేగమే నీవు గూడితే వెస భ్రమసితిఁగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిఁగా
భోగపుశ్రీవేంకటేశ పోట్లదొరితిలోన-
నీగతిఁ జెన్నుఁడవైతే నెనసితిఁగా
(||pallavi||)
appu ḍĕṭṭuṁḍĕno sitta mayyo yĕṟam̐ganaidi
sĕppuḍumāḍalage nem̐ jeranaidim̐gā
(||appu||)
kŏsarigŏsari nībai kobamuna nuṁṭim̐gāni
asamichchi nīdo māḍalāḍanaidim̐gā
pasaleni siggudoḍibaṁtānane vuṁṭim̐gāni
musimusinavvumovi mobanaidim̐gā
(||appu||)
virahabum̐gām̐kala nāvisube sūbidim̐gāni
sarim̐ bilside nūm̐kŏnam̐jālanaidim̐gā
varusavaṁtulagai ne vādulāḍidim̐gāni
muribena mŏkkide ne mŏkkanaidim̐gā
(||appu||)
vegame nīvu gūḍide vĕsa bhramasidim̐gāni
segalanīmenu pachchiseyanaidim̐gā
bhogabuśhrīveṁkaḍeśha poṭladŏridilona-
nīgadim̐ jĕnnum̐ḍavaide nĕnasidim̐gā