అప్పు డెంత చొక్కితివో అది నా మతిఁ దలఁచి
(॥పల్లవి॥)
అప్పు డెంత చొక్కితివో అది నా మతిఁ దలఁచి
ఇప్పుడే వెరగందితి నింతలో వేగినది
(॥అప్పు॥)
కనకపుటందెలతో కలలోన నొకసతి
ననుపు నీ చేయి వట్టి నవ్వినది
మునుపు నీ మోము చూచి ముచ్చటెల్ల దీరనట్టె
మనసిచ్చి నీతో నొక్కమా టాడినది
(॥అప్పు॥)
కీలుగుంటు వేసుకొని కేలు చాఁచి నీ మీఁద
వలవేసి వలుల నొరగినది
పోలించి నీకుఁగాఁ బూనుకవచ్చొకతెతో
ఆలరితనా వాదులడిచినది
(॥అప్పు॥)
కాఁగిలించి నీ మేను కరఁగించి తాఁ గరఁగి
పాఁగిన మై చెమటలఁ బరగినది
దాఁగక శ్రీవేంకటేశ తతి నదె నిక్కలాయ
ఆఁగి పురాన నాకె అలమేల్మంగయినది
(||pallavi||)
appu ḍĕṁta sŏkkidivo adi nā madim̐ dalam̐si
ippuḍe vĕragaṁdidi niṁtalo veginadi
(||appu||)
kanagabuḍaṁdĕlado kalalona nŏgasadi
nanubu nī seyi vaṭṭi navvinadi
munubu nī momu sūsi muchchaḍĕlla dīranaṭṭĕ
manasichchi nīdo nŏkkamā ṭāḍinadi
(||appu||)
kīluguṁṭu vesugŏni kelu sām̐si nī mīm̐da
valavesi valula nŏraginadi
poliṁchi nīgum̐gām̐ būnugavachchŏgadĕdo
ālaridanā vādulaḍisinadi
(||appu||)
kām̐giliṁchi nī menu karam̐giṁchi tām̐ garam̐gi
pām̐gina mai sĕmaḍalam̐ baraginadi
dām̐gaga śhrīveṁkaḍeśha tadi nadĕ nikkalāya
ām̐gi purāna nāgĕ alamelmaṁgayinadi