అప్పు డెంత లే దని నీ వాన వెట్టినా నమ్మదు
(॥పల్లవి॥)
అప్పు డెంత లే దని నీ వాన వెట్టినా నమ్మదు
ముప్పిరి నాకుఁ గా నింద మోవ నీకు నేఁటికి
(॥అప్పు॥)
పట్టకురా నీవు మమ్ముఁ బలుమారు నీచేతుల
వెట్ట గాఁగినది మేను విరహనను
అట్టె నెవ్వతె నైన నంటఁ బోతే నాపె మరి
వట్టిసందేహలు నీపై వడిఁ జుట్టుఁ జమ్మీ
(॥అప్పు॥)
మాటలాడకురా నీ నా మనసులు గలయఁగ
గాఁటపు నామన సెల్లఁ గలఁగినది
యీటున నాకలఁక నీ కిట్టె అంటితేఁ గనక
నాటకుఁడ వ నెవ్వతె నవ్వకుండుఁ జుమ్మీ
(॥అప్పు॥)
చూడకురా నాచన్నులు జొబ్బిలీఁ జెమటచేత
జోడుగా శ్రీవెంకటేశ సోఁకి నిన్నును
కూడితిని నన్ను నిట్టె కోరి యలమేల్ మంగను
యెడ నెవ్వ తైన నిన్ను నిఁక నవ్వుఁ జుమ్మీ
(||pallavi||)
appu ḍĕṁta le dani nī vāna vĕṭṭinā nammadu
muppiri nāgum̐ gā niṁda mova nīgu nem̐ṭigi
(||appu||)
paṭṭagurā nīvu mammum̐ balumāru nīsedula
vĕṭṭa gām̐ginadi menu virahananu
aṭṭĕ nĕvvadĕ naina naṁṭam̐ bode nābĕ mari
vaṭṭisaṁdehalu nībai vaḍim̐ juṭṭum̐ jammī
(||appu||)
māḍalāḍagurā nī nā manasulu galayam̐ga
gām̐ṭabu nāmana sĕllam̐ galam̐ginadi
yīḍuna nāgalam̐ka nī kiṭṭĕ aṁṭidem̐ ganaga
nāḍagum̐ḍa va nĕvvadĕ navvaguṁḍum̐ jummī
(||appu||)
sūḍagurā nāsannulu jŏbbilīm̐ jĕmaḍaseda
joḍugā śhrīvĕṁkaḍeśha som̐ki ninnunu
kūḍidini nannu niṭṭĕ kori yalamel maṁganu
yĕḍa nĕvva taina ninnu nim̐ka navvum̐ jummī