Appanichchi rimdugu nee yamganalellaa

అప్పణిచ్చి రిందుకు నీ యంగనలెల్లా
Language

(॥పల్లవి॥)
అప్పణిచ్చి రిందుకు నీ యంగనలెల్లా
చెప్పితి సంతోసాలు సిగ్గులెల్లాఁ దేరెను

(॥అప్ప॥)
యేడనైనాఁ దిరిగాడి యేమైనాఁ జేతువుగాక
వేడుకకాఁడవు నీకు వెరపేఁటికి
ఆడేవారెవ్వరు నిన్ను అనుమానించకు మిఁక
తోడనే మగవానికి దోస మెందూ లేదు

(॥అప్ప॥)
నిమ్మసం డెగరవేసి నీటు చూపుదువుగాక
యెమ్మెకాఁడవు వినయ మిఁక నేడది
సమ్మతించి రిందరును సటలుసేయకు మిఁక
నెమ్మది మేనవానికిని నింద లే దెప్పుడును

(॥అప్ప॥)
కొంకులేక కూడితివి కూరిమితో నిటు నన్ను
అంకెకాఁడ విఁక నీకు వలపున్నదా
పొంకమైరి నీసతులు పొందుము శ్రీవేంకటేశ
వుంకువవెట్టినపతి కొదుగఁగవలదు

(||pallavi||)
appaṇichchi riṁdugu nī yaṁganalĕllā
sĕppidi saṁtosālu siggulĕllām̐ derĕnu

(||appa||)
yeḍanainām̐ dirigāḍi yemainām̐ jeduvugāga
veḍugagām̐ḍavu nīgu vĕrabem̐ṭigi
āḍevārĕvvaru ninnu anumāniṁchagu mim̐ka
toḍane magavānigi dosa mĕṁdū ledu

(||appa||)
nimmasaṁ ḍĕgaravesi nīḍu sūbuduvugāga
yĕmmĕgām̐ḍavu vinaya mim̐ka neḍadi
sammadiṁchi riṁdarunu saḍaluseyagu mim̐ka
nĕmmadi menavānigini niṁda le dĕppuḍunu

(||appa||)
kŏṁkulega kūḍidivi kūrimido niḍu nannu
aṁkĕgām̐ḍa vim̐ka nīgu valabunnadā
pŏṁkamairi nīsadulu pŏṁdumu śhrīveṁkaḍeśha
vuṁkuvavĕṭṭinabadi kŏdugam̐gavaladu