అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకుమిఁక
(॥పల్లవి॥)
అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకుమిఁక
చిప్పిల మోహించిన నీచేతిలోనిదానను
(॥అప్ప॥)
యెంతనవ్వినా మేలే యెరిఁగిన విభుఁడవు
చెంతనుండి మరియేమి సేసినా మేలే
యింతమాత్రమునకే యెగ్గులెంచ తప్పులెంచ
సంతోసాన నీకులోనై సమ్మతించేదానను
(॥అప్ప॥)
అలయించినా మేలే ఆయములెరుఁగుదువు
కొలువు యిట్టె సేయించుకొన్నా మేలే
మలసినమాత్రానకే మచ్చరించ నెచ్చరించ
చెలఁగుదు నీపాదాల సేవసేసేదానను
(॥అప్ప॥)
చేరి కూడితివి మేలే శ్రీవేంకటేశుఁడవు
యీరీతినలమేల్ మంగనేమన్నా మేలే
సారె యీమాత్రానకే జంకించ బొంకించ
మేరతోనుండుదు నిన్ను మెచ్చేటిదానను
(||pallavi||)
appaṇichchenidĕ nīgu nanumāniṁchagumim̐ka
sippila mohiṁchina nīsedilonidānanu
(||appa||)
yĕṁtanavvinā mele yĕrim̐gina vibhum̐ḍavu
sĕṁtanuṁḍi mariyemi sesinā mele
yiṁtamātramunage yĕggulĕṁcha tappulĕṁcha
saṁtosāna nīgulonai sammadiṁchedānanu
(||appa||)
alayiṁchinā mele āyamulĕrum̐guduvu
kŏluvu yiṭṭĕ seyiṁchugŏnnā mele
malasinamātrānage machchariṁcha nĕchchariṁcha
sĕlam̐gudu nībādāla sevasesedānanu
(||appa||)
seri kūḍidivi mele śhrīveṁkaḍeśhum̐ḍavu
yīrīdinalamel maṁganemannā mele
sārĕ yīmātrānage jaṁkiṁcha bŏṁkiṁcha
meradonuṁḍudu ninnu mĕchcheḍidānanu