అప్పఁడు వేంకటరాయఁ డలమేలుమంగఁ గూడి
(॥పల్లవి॥)
అప్పఁడు వేంకటరాయఁ డలమేలుమంగఁ గూడి
కుప్పలుగా భోగించీఁ గోడతిరునాళ్లు
(॥॥)
చీనిచీనాంబరముల సింగారపు మేడనుండి
వీనుల సన్నగాళెలు వినుకొంటాను
పూని విహరించి వచ్చి పొందుగా నుయ్యాలలూఁగి
కోనేటిదరి మెరసీ గోడతిరుణాళ్లు
(॥॥)
ఆముకొన్నపన్నీట నద్దినదుప్పటితోడ
దోమటి పూవుదండలు దూలాడఁగా
కోమలపు టెలుఁగులకొమ్మలు లావులువాడ
గోమున నవధరించీఁ గోడతిరుణాళ్లు
(॥॥)
అడుగడుగుకు విడేలందుకొంటా సంకీర్తన
లెడయక భాగవతు లెచ్చిపాడఁగా
గొడుగులు బడగలు కోరి చామరము లిడ
గుడిగొన వినోదించీఁ గోడతిరుణాళ్లు
(॥॥)
నానావాద్యాలతో సట్టువలు గడించఁగా
పానిపట్టి మంచిమంచి పాత్ర లాడఁ గా
ఆనుక కోలాటములు అంత నింతఁ జూచుకొంటా
కోనేటిరాయఁడు మెచ్చీఁ గోడతిరుణాళ్లు
(॥॥)
వరుసతో విణ్ణాపఁజివారు తాళము లోత్తుచు
పొరిఁదొరి ద్రావిడానఁ బొగడఁగాను
విరులు యేకాంగులు వినువీధిఁ జల్లఁగాను
గురుతరముగ మించీఁ గోడతిరుణాళ్లు
(॥॥)
పప్పులు నిడ్డెనలును పానకాలు ఫలములు
ఆప్పటప్పటికిఁ బైపై నారగింపుచు
చెప్పరాని మహిమల శ్రీ వేంకటేశ్వరుఁడు
కుప్పళించీ వాసనలఁ గోడతిరుణాళ్లు
(||pallavi||)
appam̐ḍu veṁkaḍarāyam̐ ḍalamelumaṁgam̐ gūḍi
kuppalugā bhogiṁchīm̐ goḍadirunāḽlu
(||||)
sīnisīnāṁbaramula siṁgārabu meḍanuṁḍi
vīnula sannagāḽĕlu vinugŏṁṭānu
pūni vihariṁchi vachchi pŏṁdugā nuyyālalūm̐gi
koneḍidari mĕrasī goḍadiruṇāḽlu
(||||)
āmugŏnnabannīḍa naddinaduppaḍidoḍa
domaḍi pūvudaṁḍalu dūlāḍam̐gā
komalabu ṭĕlum̐gulagŏmmalu lāvuluvāḍa
gomuna navadhariṁchīm̐ goḍadiruṇāḽlu
(||||)
aḍugaḍugugu viḍelaṁdugŏṁṭā saṁkīrdana
lĕḍayaga bhāgavadu lĕchchibāḍam̐gā
gŏḍugulu baḍagalu kori sāmaramu liḍa
guḍigŏna vinodiṁchīm̐ goḍadiruṇāḽlu
(||||)
nānāvādyālado saṭṭuvalu gaḍiṁcham̐gā
pānibaṭṭi maṁchimaṁchi pātra lāḍam̐ gā
ānuga kolāḍamulu aṁta niṁtam̐ jūsugŏṁṭā
koneḍirāyam̐ḍu mĕchchīm̐ goḍadiruṇāḽlu
(||||)
varusado viṇṇābam̐jivāru tāḽamu lottusu
pŏrim̐dŏri drāviḍānam̐ bŏgaḍam̐gānu
virulu yegāṁgulu vinuvīdhim̐ jallam̐gānu
gurudaramuga miṁchīm̐ goḍadiruṇāḽlu
(||||)
pappulu niḍḍĕnalunu pānagālu phalamulu
āppaḍappaḍigim̐ baibai nāragiṁpusu
sĕpparāni mahimala śhrī veṁkaḍeśhvarum̐ḍu
kuppaḽiṁchī vāsanalam̐ goḍadiruṇāḽlu