Appamdu daivaalaraayam daadimoola meedamdu

అప్పఁడు దైవాలరాయఁ డాదిమూల మీతఁడు
Language

(॥పల్లవి॥)
అప్పఁడు దైవాలరాయఁ డాదిమూల మీతఁడు
యిప్పు డిట్టిమహిమల నెక్కుడాయ నీతఁడు

(॥అప్పఁ॥)
చేకొని తొలితొలుతే చేసిన పన్నీరుకాపు
జోకఁ గాలువలై సొరిది జార
సైకపునీలాద్రినుండి జలజల బారేటి-
రేకల సెలయేరులరీతి నున్న దిదివో

(॥అప్పఁ॥)
తెప్పలుగా గుప్పినట్టి తెల్లని కప్పురకాపు
చిప్పిలుచు వెన్నెలలై చిందఁగాను
పుప్పొడిఁదోఁగిన కల్పభూజము నిలుచున్న-
చొప్పున నున్నాఁడిదివో సొంపులు మీరుచును

(॥అప్పఁ॥)
పొందుగ నంతటిమీఁదఁ బూసిన పునుగుకాపు
కందువ మాణిక్యముల గనియైనట్టు
అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ
చెంది యరతఁ గట్టఁగా శ్రీవిభుఁడై నిలిచె

(||pallavi||)
appam̐ḍu daivālarāyam̐ ḍādimūla mīdam̐ḍu
yippu ḍiṭṭimahimala nĕkkuḍāya nīdam̐ḍu

(||appam̐||)
segŏni tŏlidŏlude sesina pannīrugābu
jogam̐ gāluvalai sŏridi jāra
saigabunīlādrinuṁḍi jalajala bāreḍi-
regala sĕlayerularīdi nunna didivo

(||appam̐||)
tĕppalugā guppinaṭṭi tĕllani kappuragābu
sippilusu vĕnnĕlalai siṁdam̐gānu
puppŏḍim̐dom̐gina kalbabhūjamu nilusunna-
sŏppuna nunnām̐ḍidivo sŏṁpulu mīrusunu

(||appam̐||)
pŏṁduga naṁtaḍimīm̐dam̐ būsina punugugābu
kaṁduva māṇikyamula ganiyainaṭṭu
aṁdi śhrīveṁkaḍeśhvaru kadĕ yalamelumaṁga
sĕṁdi yaradam̐ gaṭṭam̐gā śhrīvibhum̐ḍai nilisĕ